సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రొమాంటిక్‌ సీన్స్‌.. ఉంటాయని ముందే చెప్పారు

ABN, Publish Date - Feb 13 , 2026 | 07:54 AM

లివింగ్‌ టు గెదర్‌ అనే అంశాన్ని ఇప్పటి యువత ఆలోచనలకు తగ్గట్లు చాలా కొత్తగా ఈ సినిమాలో చూపించాం’ అని మానస వారణాసి అన్నారు.

Manasa Varanasi

‘కపుల్‌ ఫ్రెండ్లీ’ (Couple Friendly) చిత్రం మనం సాధారణంగా చూసే ప్రేమకథలకు భిన్నంగా ఉంటుంది. వేర్వేరు లక్ష్యాలతో చెన్నైలో కలిసిన తెలుగు అబ్బాయి, అమ్మాయి జీవితంలో జరిగిన ఆసక్తికర సంఘటనల సమాహారంగా తెరకెక్కింది. లివింగ్‌ టు గెదర్‌ అనే అంశాన్ని ఇప్పటి యువత ఆలోచనలకు తగ్గట్లు చాలా కొత్తగా ఈ సినిమాలో చూపించాం’ అని మానస వారణాసి (Manasa Varanasi)అన్నారు.

సంతోష్‌ శోభన్ (Santosh Soban) కు జోడీగా ఆమె నటించిన చిత్రమిది. అశ్విన్‌ చంద్రశేఖర్ (Ashwin Chandrasekar) దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్‌ నిర్మించింది. ఈ శనివారం విడుదలవుతున్న సందర్భంగా మానస వారణాసి మీడియాతో ముచ్చటించారు. ‘నేను ఇందులో మిత్ర అనే మధ్య తరగతి అమ్మాయి పాత్ర పోషించాను. తను చాలా సరదాగా ఉంటుంది. కొత్త ఆలోచనలు చేస్తుంది. నా దృష్టిలో గ్లామర్‌ అంటే కేవలం ఎక్స్‌పోజింగ్‌ కాదు. కథ విన్నప్పుడే డైరెక్టర్‌ గారు రొమాంటిక్‌ సీన్స్‌ ఉంటాయని చెప్పారు. మొదట్లో సందేహించినా, టీమ్‌ అందరూ చాలా ప్రొఫెషనల్‌గా ఉండడంతో నమ్మకం కలిగింది’ అని అన్నారు.

Updated Date - Feb 13 , 2026 | 08:43 AM