సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పేట్రియాట్ ట్రైల‌ర్ అదిరింది.. మ‌ల‌యాళ స్టార్లంతా ఒకే సినిమాలో

ABN, Publish Date - Apr 05 , 2026 | 08:51 AM

సుమారు రెండు ద‌శాబ్దాల సుదీర్ఘ గ్యాప్‌ త‌ర్వాత‌ మలయాళ సూపర్‌స్టార్స్‌ మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి న‌టించిన చిత్రం పేట్రియాట్.

సుమారు రెండు ద‌శాబ్దాల సుదీర్ఘ గ్యాప్‌ త‌ర్వాత‌ మలయాళ సూపర్‌స్టార్స్‌ మమ్ముట్టి (Mammootty), మోహన్‌లాల్ (Mohanlal) కలిసి న‌టించిన చిత్రం పేట్రియాట్ (Patriot). ఫహద్‌ ఫాజిల్ (Fahadh Faasil), కుంచకో బోబన్ (Kunchacko Boban), నయనతార (Nayanthara), ద‌ర్శ‌న (Darshana Rajendran), రేవ‌తి (Revathy) వంటి స్టార్లు ప్ర‌ధాన పాత్ర‌లు చేశారు. మహేశ్‌ నారాయణ్ (Mahesh Narayanan) దర్శకత్వం వ‌హించాడు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే1న పాన్ ఇండియాగా ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు విడుదల చేసిన గ్లింప్స్, టీజ‌ర్ సినిమాపై మంచి అంచ‌నాలు తీసుకురాగా తాజాగా శ‌నివారం ఈ చిత్రం అఫీసియ‌ల్ ట్రైల‌ర్ మ‌ల‌యాళం భాష‌లో రిలీజ్ చేశారు. త్వ‌ర‌లో ఇత‌ర ప్రాంతీయ భాష‌ల‌లోనూ ట్రైల‌ర్‌ విడుద‌ల చేయ‌నున్నారు.

తాజాగా వ‌చ్చిన ట్రైల‌ర్ చూస్తే.. ఔట్ అండ్ ఔట్ ఫుల్ ఇంటెన్స్ ఇన్వెస్టిగేష‌న్‌, స్పై థ్రిల్ల‌ర్‌గా చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. సైబ‌ర్ క్రైమ్స్‌, ఓ క‌ర‌డుగ‌ట్టిన క్రిమిన‌ల్‌, అత‌ని క‌ద‌లిక‌లు నిత్యం గ‌మ‌నించే నిఘా వ్య‌వ‌స్థ‌, క్రిమిన‌ల్‌కు సాయం చేసే ఓ విక‌లాంగుడైన స్నేహితుడు, ఆపై ఓ బ‌డా సాప్ట్‌వేర్ కంపెనీ ఓన‌ర్ అత‌ను చేసే ప‌నులు, అందులో పని చేసే ఇద్ద‌రు మెయిన్ ఎంఫ్లాయిస్‌ల చుట్టూ సినిమా న‌డువ‌నున్న‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తోంది. విజువ‌ల్స్‌, యాక్ష‌న్ సీన్లు సైతం అద‌ర‌హో అనేలా ఉన్నాయి. నిర్మాణ విలువ‌లు సైతం ఓ హాలీవుడ్ సినిమాను ఏమైనా చూస్తున్నామా అనేలా ట్రైల‌ర్ ఉంది.

Updated Date - Apr 05 , 2026 | 08:55 AM