సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Koragajja:  మమ్ముట్టి సినిమా ఈవెంట్..  ‘కొరగజ్జ’  ప్రచారానికి బ్రేక్ 

ABN, Publish Date - Jan 31 , 2026 | 03:12 PM

కన్నడ చిత్రం ‘కొరగజ్జ’ (koragajja)ప్రచార కార్యక్రమం కొచ్చిలో అనుకోని షెడ్యూల్ సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. జనవరి 24న కొచ్చి హాలిడే ఇన్‌లోని గ్రాండ్ బాల్‌రూమ్‌లో నిర్వహించాల్సిన మీడియా ఇంటరాక్షన్  వాయిదా పడింది.

కన్నడ చిత్రం ‘కొరగజ్జ’ (koragajja)ప్రచార కార్యక్రమం కొచ్చిలో అనుకోని షెడ్యూల్ సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. జనవరి 24న కొచ్చి హాలిడే ఇన్‌లోని గ్రాండ్ బాల్‌రూమ్‌లో నిర్వహించాల్సిన మీడియా ఇంటరాక్షన్  వాయిదా పడింది. అదే సమయంలో మలయాళ చిత్రానికి సంబంధించిన ఈవెంట్స్  షెడ్యూల్ కావడంతో  ‘కొరగజ్జ’  వాయిదా పడింది.  దీనికి సంబంధించిన  వారం ముందు  రోజుల ముందుగానే కొచ్చి మీడియాకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటుడు కబీర్ బేడీ, సీనియర్ నటి భవ్య ప్రత్యేకంగా కొచ్చికి వచ్చారు. అయితే ఈ ఈవెంట్‌కు ముందురోజు రాత్రి మమ్ముట్టి నటించిన మలయాళ చిత్రం ప్రెస్‌మీట్ అదే సమయానికి షెడ్యూల్ అయినట్లు తమకు సమాచారం అందిందని ‘కొరగజ్జ’ బృందం తెలిపింది. కొచ్చిలో వినోద రంగానికి చెందిన జర్నలిస్టుల సంఖ్య పరిమితంగా ఉండటంతో మీడియా హాజరు విషయంలో సందేహాలు తలెత్తాయి. ఈ పరిస్థితుల్లో ప్రెస్‌మీట్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. దర్శకుడు సుధీర్ అత్తావర్ , నిర్మాత త్రివిక్రమ్ సపాల్య ఈ ఘటనపై తమ నిరాశని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. షెడ్యూల్ సమస్యలు సహజమే అయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో పీఆర్ బృందాల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని వారు అభిప్రాయపడ్డారు. ‘కొరగజ్జ’ చిత్రానికి పలువురు మలయాళ టెక్నీషియన్లు, గాయకులు పనిచేశారని నిర్మాతలు గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో ఈ సినిమాకు మీడియా నుంచి మంచి స్పందన లభించిందని చెప్పారు.


సినిమా ప్రచారం కోసం కొచ్చికి వచ్చిన కబీర్ బేడీకి మలయాళ సినీ పరిశ్రమపై తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. ఈ పరిస్థితి బాధాకరమని పేర్కొంటూ ఇలాంటి షెడ్యూల్ ఓవర్‌ల్యాప్‌లు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా పరిశ్రమలోని అన్ని వర్గాల మధ్య మెరుగైన కమ్యూనికేషన్ ఉంటే పరస్పర గౌరవం నిలబడుతుందని వ్యాఖ్యానించారు. సీనియర్ నటి భవ్య కూడా ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కళాకారులు, మీడియాకు ఇచ్చిన హామీలను గౌరవించడం ఎంతో ముఖ్యమని అన్నారు. ‘మంగళూరు సహా పలు నగరాల్లో ‘కొరగజ్జ’ ప్రచార కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయని, కొచ్చిలో ప్రెస్‌మీట్ వాయిదా పడటం సినిమా ప్రచార వేగంపై ప్రభావం చూపిందని నిర్మాత త్రివిక్రమ్ సపాల్య అన్నారు 

Updated Date - Jan 31 , 2026 | 03:23 PM