మమ్ముట్టి: రుచి.. వాసన కోల్పోయాను
ABN, Publish Date - Feb 19 , 2026 | 09:08 AM
మలయాళ స్టార్ మమ్ముట్టి గతేడాది అనారోగ్యంతో రుచి, వాసన శక్తి కోల్పోయినట్టు వెల్లడించారు.
మలయాళ హీరో మమ్ముట్టి (Mammootty) గతేడాది అనారోగ్యంతో నటనకు విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఆయన స్పందించారు. 'వినికిడి శక్తి. చూపు మనిషికి అత్యంత కీలకం. ఒక్కోసారి శ్వాసను పీల్చుకుంటున్నా, వాసనను పసిగట్టే సామర్ధ్యాన్ని కోల్పోతాం. ఆ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది. నేను ఆ సమస్యను అనుభవించా. కొంత కాలం రుచి, వాసన సామర్థ్యాల్ని కోల్పోయాను. ఇప్పుడిప్పుడే తిరిగి వాటిని పొందుతున్నాను. అటువంటి సామర్ధ్యాలను కోల్పోయినప్పుడే వాటి విలువ మనకు తెలుస్తుంది.
ఎవరైనా గట్టిగా మాట్లాడితే చిన్నగా మాట్లాడమని అడుగుతాం. మనకు వినికిడి శక్తి ఉంది కాబట్టే అలా చెప్పగలుగుతున్నాం. అయితే వినికిడి శక్తి లేని వారు అలా చెప్పలేరు. వారికి ఎలా మాట్లాడినా తేడా అనిపించదు. వినికిడి శక్తి దేవుడిచ్చిన వరం' అని చెప్పారు. ఇదిలాఉంటే.. మమ్ముట్టి నటించిన 'పేట్రియాట్' చిత్రం ఏప్రిల్ 23న పాన్ ఇండియాగా విడుదలవుతోంది. ఇందులో మోహన్ లాల్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. అలాగే సీనియర్ దర్శకుడు ఆడూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో 'పాదయాత్ర'లో... ధనుష్ 'డీ 55'లో మమ్ముట్టి నటిస్తున్నారు.