సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mamitha Baiju: ప్రేమలు బ్యూటీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యినట్టుందే

ABN, Publish Date - May 04 , 2026 | 03:46 PM

2024 లో వచ్చిన ప్రేమలు(Premalu) చిత్రంతో అటు మలయాళంతో పాటు, తెలుగు, తమిళ భాషల్లో రీనూగా కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకున్న మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు (Mamitha Baiju).

Mamitha Baiju

Mamitha Baiju: 2024 లో వచ్చిన ప్రేమలు(Premalu) చిత్రంతో అటు మలయాళంతో పాటు, తెలుగు, తమిళ భాషల్లో రీనూగా కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకున్న మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు (Mamitha Baiju). ఆ చిత్రం కన్నా ముందు చాలా చిత్రాలు చేసిన అవి కేవలం అమ్మడిని మలయాళ ఇండస్ట్రీకే పరిమితం చేశాయి. కానీ ప్రేమలు చిత్రం అమ్మడి కెరీర్‌కు మంచి బూస్టప్‌ను ఇచ్చింది. ఆ బూస్టప్‌ ఇప్పుడు తమిళ, మలయాళ టాప్‌ స్టార్స్‌ తో అవకాశాలను తెచ్చిపెడుతుంది. అయితే ఈ ఏడాది అమ్మడు టైమింగ్‌ అస్సలు బాగున్నట్లు కనిపించట్లేదు. మరి ఇది అమ్మడి కెరీర్‌ను ప్రమాదంలో నెట్టే అవకాశం ఉందా..?


ప్రేమలు అందించిన జోష్‌తో గతేడాది ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి డ్యూడ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ సినిమా హిట్ క్రెడిట్ అంతా హీరో ప్రదీప్ ఖాతాలోకి వెళ్ళిపోయింది కానీ, మమితాకు ఆశించిన స్థాయిలో మైలేజ్ రాలేదు. ఈ ఏడాది దళపతి విజయ్‌తో నటించిన జననాయగన్ సినిమాపై మమితా చాలా ఆశలే పెట్టుకుంది. సెన్సార్ ఇబ్బందుల వల్ల ఆ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇక రీసెంట్‌గా కోలీవుడ్ స్టార్ ధనుష్ సరసన కర మూవీతో పలకరించింది. ఏప్రిల్ 30న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద పెద్దగా సౌండ్ చేయలేకపోయింది. మమితా పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులే పడినా, సినిమా రిజల్ట్ మాత్రం ఆమె కెరీర్‌కు స్పీడ్ బ్రేకర్ లాగే మారింది.


ఇక ఇప్పుడు అందరి దృష్టి అమ్మడి టాలీవుడ్ ఎంట్రీపైనే ఉంది. విశ్వనాథం అండ్ సన్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది మమితా. టీజర్‌లో ఆమె లుక్స్ అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా సినిమాపై పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద రిస్క్ దాగి ఉంది. ఈ సినిమాలో మమితా 20 ఏళ్ల అమ్మాయిగా నటిస్తూ.. 40 ఏళ్ల వయసున్న సూర్యతో ప్రేమాయణం సాగించే పాత్రలో కనిపిస్తోంది. వయసులో ఇంత వ్యత్యాసం ఉన్న హీరోతో రొమాన్స్ చేయడం అంటే అది కత్తి మీద సాము లాంటిదే. ఆడియన్స్ ఈ పెయిర్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే దానిపైనే ఆమె టాలీవుడ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.


ప్రస్తుతం ఆమె చేతిలో తమిళంలో ఇరండు వానం, మలయాళంలో బెత్లెహమ్ కుటుంబం వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తెలుగులో క్రేజీ ఆఫర్స్ వస్తున్నప్పటికీ మమితా వాటిని సున్నితంగా తిరస్కరిస్తోంది. బహుశా కథల ఎంపికలో ఆమె ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక్క హిట్ రాగానే వరుసగా సినిమాలు సైన్ చేసే హీరోయిన్లు కొందరైతే, ఆచి తూచి అడుగులు వేసేవారు మరికొందరు. మమితా రెండో కేటగిరీలోకి వస్తుంది. నిజానికి ప్రతి నటి కెరీర్‌లోనూ ఒడిదుడుకులు సహజం. మరి ఈ గమ్మత్తైన పాత్రలతో మమితా మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందో లేదో చూడాలి.

Updated Date - May 04 , 2026 | 03:56 PM