సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మమితా బైజు పెళ్లి.. నిజ‌మేనా!

ABN, Publish Date - Oct 13 , 2026 | 07:06 PM

మమితా బైజు పెళ్లి నిర్ణయం గురించి సోషల్ మీడియాలో ఓ ప్రచారం వైరల్ అవుతోంది. ఈ పోస్టుపై ఆమె స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆమె ఏమని రియాక్ట్ అయ్యారంటే?

Mamitha Baiju

ఈ ఏడాది జననాయకుడు (Jana Nayagan), విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath & Sons), 'బెత్లహాం కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit) చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు మమితా బైజు (Mamitha Baiju). తాజాగా ఆమె గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. మమితా బైజు జీవితంలోని ప్రతీ నిర్ణయాన్ని ముఖ్యంగా ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవాలనే దానిని కూడా తన సోదరుడు మిథున్ బైజునే డిసైడ్ చేస్తారనేది ఆ ప్రచారంలోని సారాంశం.

తాజాగా ఈ అంశంపై ఆమె రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఓ పేజీ ఈ విషయాన్ని పోస్ట్ చేయగా.. దానికి 'ఏంటీ?' అనే స్టిక్కర్‌ను బదులుగా పెట్టారు ఆమె. దీంతో ఆమె సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ అంతే అల్లరిగా ఉంటారని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం హలో డియ‌ర్ (Hello Dear ) అనే మ‌ల‌యాళ సినిమాతో పాటు త‌మిళంలో ఇరందు వానం (Irandu Vaanam), ప్ర‌దీప్ రంగ‌నాథ్‌ సినిమాల్లో నటిస్తూ మరోసారి ప్రేక్షకులను వరుస చిత్రాలతో పలకరించేందుకు సిద్ధమవుతోంది మమిత. అలాగే తెలుగులో 'జై హను-మాన్' లోనూ ఓ కీలక పాత్ర పోషిస్తోంది.

Updated Date - Oct 13 , 2026 | 07:06 PM