సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

I, Nobody: పృథ్వీరాజ్ మూవీకీ పెయిడ్ ప్రీమియర్స్!

ABN, Publish Date - Jul 04 , 2026 | 02:44 PM

పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ఐ, నోబడీ' చిత్రం పెయిడ్ ప్రీమియర్స్ షోస్‌ ఈ నెల 9న రెండు తెలుగు రాష్ట్రాలలో పడబోతున్నాయి. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పార్వతి తిరువోలు హీరోయిన్‌గా నటించింది.

Prithviraj Sukumaran I Nobody

మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌కి తెలుగు లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలు కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో సినిమాలు చేస్తుంటారు. రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘ వారణాసి’ లో కూడా ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా నటించిన చిత్రం ‘ఐ, నోబడీ’.

విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు నిస్సాం బషీర్ దర్శకత్వంలో జాతీయ అవార్డు గ్రహీత పార్వతి తిరువోతుతో కలిసి పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన అత్యంత ఆసక్తికరమైన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. జూలై 9న మలయాళంలోనూ, జూలై 10న తెలుగులోనూ ఇది గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. అగ్ర నిర్మాణ సంస్థలు శ్రీ స్రవంతి మూవీస్, మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.


ఈ సినిమా కథ గురించి స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ, 'ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగి రాజు జీవితంలో అనూహ్యంగా జరిగిన సంఘటనలతో కథ ప్రారంభమవుతుంది. భారీ బ్యాంకు దోపిడీకి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజు, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి అనివార్య పరిస్థితుల్లో హింసాత్మక మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. అసలు అతను నేరస్థుడేనా? లేక పరిస్థితుల బారిన పడిన అమాయకుడా? ఈ కుట్ర వెనుక ఉన్న అసలు నిజం ఏమిటి? అనే ఉత్కంఠభరితమైన ప్రశ్నలకు సమాధానమే ‘ఐ, నోబడీ’. భావోద్వేగాలు, సస్పెన్స్, యాక్షన్ అంశాలను సమపాళ్లలో మేళవించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసేలా రూపొందింది. పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు తమ కెరీర్‌లో మరో గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించనుండగా, దర్శకుడు నిస్సాం బషీర్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు' అని అన్నారు. మలయాళంలో 'ఐ, నోబడీ' ఈ నెల 9న విడుదల అవుతోందని, అందుకే తెలుగులోనూ ఆ రోజున పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నామని, 10న రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల భారీ స్థాయిలో ఇది ప్రదర్శితమౌతుందని స్రవంతి రవికిశోర్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Varanasi: క్రేజీ ఫొటో.. రాముడిగా మహేష్ బాబు లుక్ ఇదేనా

Bandla Ganesh: సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా.. న్యాయం సాధిస్తా..

ఒక్క సినిమా కోసం.. నాని రెండు చిత్రాలు వదిలేశాడా

Updated Date - Jul 04 , 2026 | 02:46 PM