ఓటీటీకి వచ్చేస్తున్న ఇండస్ట్రీ హిట్.. బెత్లెహేమ్ కుటుంబ యూనిట్.. ఎక్కడ చూడొచ్చు అంటే
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:16 PM
ఈ ఏడాది మలయాళ చిత్రసీమలో సరికొత్త రికార్డులను తిరగరాసిన చిత్రాల్లో బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ ఒకటి. యూత్ స్టార్ నివిన్ పౌలీ, కుర్రకారు క్రష్ మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ప్రేమలు ఫేమ్ గిరీష్ ఏడీ దర్శకత్వం వహించాడు.
ఈ ఏడాది మలయాళ చిత్రసీమలో సరికొత్త రికార్డులను తిరగరాసిన చిత్రాల్లో బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit) ఒకటి. యూత్ స్టార్ నివిన్ పౌలీ, కుర్రకారు క్రష్ మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ప్రేమలు ఫేమ్ గిరీష్ ఏడీ దర్శకత్వం వహించాడు. ప్రముఖ నిర్మాతలు ఫహద్ ఫాజిల్, దిలీష్ పోతన్ ఈ చిత్రాన్ని నిర్మించగా, ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 320 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, మలయాళంలో ఆల్-టైమ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ ద్వారా అక్టోబర్ 2 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తోంది.
క్యాటరింగ్ వ్యాపారం నడుపుకునే జస్టిన్ (నివిన్ పౌలీ) గతంలోని చేదు జ్ఞాపకాల వల్ల పెళ్లికి దూరంగా ఉంటాడు. అలాంటి సమయంలో అతడి పక్క ఇంట్లోకి అద్దెకు వచ్చిన చురుకైన కాలేజీ అమ్మాయి యాష్లే (మమితా బైజు) పరిచయంతో అతడి జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారడంతో, వయసు తేడా వల్ల ఎదురయ్యే సామాజిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తమ బంధాన్ని రహస్యంగా ఉంచాలని ప్లాన్ చేసుకుంటారు. అయితే ఊహించని పరిణామాల మధ్య వీరి ప్రేమ విషయం బెత్లెహేమ్ చర్చి కుటుంబ యూనిట్ సభ్యులకు, అలాగే ఇరు కుటుంబాలకు తెలిసిపోతుంది. పెద్దా చిన్న తేడాలు, సమాజం నుంచి ఎదురయ్యే ప్రశ్నలు, కుటుంబాల మధ్య తలెత్తే మనస్పర్థల నడుమ వీరిద్దరూ తమ ప్రేమను ఎలా నిలబెట్టుకున్నారనేది మిగతా కథ.
దర్శకుడు గిరీష్ ఏడీ ఈ సీరియస్ పాయింట్‌ను కూడా తనదైన మార్కు మార్క్ హ్యూమర్, చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు హృదయానికి హత్తుకునే డైలాగ్స్‌తో ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించారు. థియేటర్లలో చూడటం మిస్సయిన ఫ్యామిలీ ఆడియన్స్ ఈ దసరా పండుగ కానుకగా ఓటీటీలో ఈ వినోదాత్మక చిత్రాన్ని వీక్షించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. థియేటర్లో రికార్డులను తిరగరాసిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
‘ద ప్యారడైజ్’.. 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే..
‘రణబాలి’ విడుదలకు ముందే ఓటీటీలోకి.. అసలు విషయమిదే
తెలుగులో థియేటర్లకు.. కీర్తి సురేశ్, సనంత్ లెస్బియన్ మూవీ