సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నజ్రియా అందాల ఆరబోత.. ఫహాద్ తో విడాకులు కోసమేనా

ABN, Publish Date - Oct 27 , 2026 | 05:50 PM

మలయాళ నటి నజ్రియా నజీమ్ (Nazriya Nazim) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని హీరోగా నటించిన అంటే సుందరానికీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

Nazriya

మలయాళ నటి నజ్రియా నజీమ్ (Nazriya Nazim) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని హీరోగా నటించిన అంటే సుందరానికీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు కానీ, నజ్రియాకి మాత్రం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని తీసుకొచ్చిపెట్టింది. ఇక నజ్రియా ఎవరో కాదు.. మలయాళ స్టర్ హీరో ఫహాద్ ఫాజిల్(Fahadh Faasil) భార్య. బెంగుళూరు డేస్ సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది.


ఇక పెళ్లి తరువాత కూడా నజ్రియా హిట్ సినిమాల్లో నటించింది. అయితే రెండేళ్ల క్రితం ఈ చిన్నది అటు సినిమాలకి, ఇటు సోషల్ మీడియాకి దూరంగా ఉంది. ఆ తరువాత ఒకరోజు నజ్రియా సోషల్ మీడియా సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది. అందులో ఆమె కొన్నిరోజుల నుంచి తన జీవితం నచ్చలేదని, అందుకే గ్యాప్ తీసుకున్నట్లు తెలిపింది. ఆ డిప్రెషన్ వలనే సూక్ష్మదర్శిని సినిమా హిట్ సెలబ్రేషన్స్ లో కూడా పాలుపంచుకోలేకపోయినట్లు చెప్పింది. ఇక ఈ పోస్ట్ తరువాత నుంచే నజ్రియా- ఫహాద్ మధ్య విభేదాలు తలెత్తాయి అని టాక్ బయటకు వచ్చింది.


కొన్నాళ్ళు ఈ జంట బయట కూడా కనిపించలేదు. ఆ తరువాత ఏదో మొక్కుబడికి అన్నట్లు ఒక ఫోటో షేర్ చేసి తామిద్దరం కలిసే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో ఈ రూమర్స్ కి చెక్ పడింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ విడాకుల వార్త ట్రెండింగ్ లోకి వచ్చింది. అందుకు కారణం నజ్రియా అందాల ఆరబోత చేయడమే. ఆమె హీరోయిన్ గా నటించిన సీన్ సినిమా ప్రమోషన్స్ లో నజ్రియా ఒక ఎల్లో కలర్ డిజైనర్ డ్రెస్ లో కనిపించింది. డ్రెస్ అంతా బాగానే ఉంది కానీ, క్లీవేజ్ కొంచెం డీప్ గా కనిపించింది. దుపట్టాతో కవర్ చేసినా కూడా ఆమె క్లీవేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. నజ్రియాని మునుపెన్నడూ అలా చూడని ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎప్పుడు లేనిది నజ్రియా ఇలా అందాలను ఆరబోయడం వెనుక మిస్టరీ ఏమైనా ఉందా అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఫహాద్ తో విడాకుల కోసమే ఆమె ఇలా చేస్తుందని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇక సూర్య, నెస్లెన్, నజ్రియా కీలక పాత్రల్లో నటించిన సీన్ నవంబర్ 6 న రిలీజ్ కానుంది.

Updated Date - Oct 27 , 2026 | 06:01 PM