ఆగిపోయిన ప్రేమలు 2.. కారణం అదే
ABN, Publish Date - May 30 , 2026 | 04:29 PM
ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సీక్వెల్స్ లో ప్రేమలు 2 (Premalu 2) కూడా ఒకటి. మలయాళంలోనే కాకుండా తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా హీరోయిన్ మమితా బైజు (Mamitha Baiju)ను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మార్చేసింది.
ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సీక్వెల్స్ లో ప్రేమలు 2 (Premalu 2) కూడా ఒకటి. మలయాళంలోనే కాకుండా తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా హీరోయిన్ మమితా బైజు (Mamitha Baiju)ను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మార్చేసింది. నస్లీన్ కె గఫుర్ హీరోగా గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ప్రేమలు 2024 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. సచిన్- రీనూల క్యూట్ లవ్ స్టోరీని ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ అందరూ ఎంతో ఖుషీ అయ్యారు. ఎప్పుడెప్పుడు ఈ సీక్వెల్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
అయితే ప్రేమలు 2 సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఒక చేదు వార్త అందింది. గత కొన్నిరోజులుగా ప్రేమలు 2 సీక్వెల్ ఆగిపోయిందని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అవి రూమర్స్ అని ఫ్యాన్స్ అనుకున్నారు. తాజాగా అవి రూమర్స్ కాదని ప్రేమలు 2 ఆగిపోయిందని హీరో నస్లీన్ కన్ఫర్మ్ చేశాడు. ఒక ఇంటర్వ్యూలో నస్లీన్ ప్రేమలు 2 ఆగిపోవడానికి కారణాలను కూడా వెల్లడించాడు.
'ప్రేమలు 2 సినిమా ఆగిపోవడానికి ముఖ్య కారణం అనుకున్న స్క్రిప్ట్ ఆశించిన స్థాయిలో కుదరకపోవడమే. మొదటి భాగం సృష్టించిన భారీ విజయం కారణంగా ప్రేక్షకులు ఈ సీక్వెల్ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగా కథను సిద్ధం చేయడం పెద్ద సవాలుగా మారింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మరియు కథలో స్పష్టత లేకపోవడం వల్ల ఎవరూ సంతృప్తిగా లేరు. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను ఇక్కడితోనే ఆపేయాలని చిత్ర నిర్మాత దిలీష్ పోతన్, దర్శకుడు గిరీష్ ఏ.డీలతో సహా టీమ్ మొత్తం ఒక ఉమ్మడి నిర్ణయానికి వచ్చినట్లు' తెలిపాడు.