సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆ హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్న 'ప్రేమలు' హీరో

ABN, Publish Date - Nov 10 , 2026 | 05:11 PM

'ప్రేమలు' (Premalu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ సంపాదించుకున్న మలయాళ యంగ్ హీరో నస్లేన్ కె. గఫూర్ (Naslen K. Gafoor). ఈ 26 ఏళ్ల కుర్రాడు.. ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. తాజాగా సీన్ సినిమాలో సూర్యకు ధీటైన విలన్ గా కనిపించి షాక్ ఇచ్చాడు.

Naslen K. Gafoor

'ప్రేమలు' (Premalu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ సంపాదించుకున్న మలయాళ యంగ్ హీరో నస్లేన్ కె. గఫూర్ (Naslen K. Gafoor). ఈ 26 ఏళ్ల కుర్రాడు.. ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. తాజాగా సీన్ సినిమాలో సూర్యకు ధీటైన విలన్ గా కనిపించి షాక్ ఇచ్చాడు. అసలు సూర్యని డామినేట్ చేసిన అతని నటనకు ఫ్యాన్స్ ఫిధా అవుతున్నారు. ఈశ్వరన్ పాత్ర అతడి కోసమే పుట్టింది అన్నట్లు అనిపించిందని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నస్లేన్ ప్రేమలో పడ్డాడని టాక్ నడుస్తోంది. నటి, మోడల్ అనార్కలి నాజర్ (Anarkali Nazar) తో నస్లేన్ డేటింగ్‌లో ఉన్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నస్లేన్ తాను సింగిల్‌గా లేను అని చిన్న క్లూ ఇవ్వడంతో, ఆ లక్కీ గర్ల్ అనార్కలి నాజరే అయి ఉంటుందని నెటిజన్లు ఊహాగానాలు మొదలుపెట్టారు. మోహన్ కుమార్ ఫ్యాన్స్, బ్లడీ బెగ్గర్ చిత్రాలతో అనార్కలి నాజర్ గుర్తింపు తెచ్చుకుంది. ప్రేమలు కన్నా ముందే వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఈ రూమర్లు మొదలయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో వీరిద్దరి ఫ్యాన్ మేడ్ వీడియోలు, ఫొటో ఎడిట్‌లు వైరల్‌గా మారడంతో ఈ లవ్ రూమర్లకు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా ఇద్దరూ కూడా తమ ఫోటోలను ఓకే చోట దిగి వేరువేరుగా పోస్ట్ చేయడం, ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకోవడంతో ఈ జంటను మాలీవుడ్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నగా అభివర్ణిస్తున్నారు.


అయితే, ఈ వార్తలపై నస్లేన్ కానీ, అనార్కలి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వీరిద్దరూ ఒకే ఫ్రెండ్ సర్కిల్‌కు చెందినవారు కావడం, తరచుగా పార్టీల్లో కలిసి కనిపించడమే ఈ రకమైన గాసిప్స్‌కు కారణమని , వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని, ఎలాంటి రిలేషన్ వీరిమధ్య లేదని.. ప్రస్తుతం నస్లేన్ ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని అతని సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. ఏదిఏమైనా నస్లేన్ తన కెరీర్ పీక్స్ టైమ్ లో ఇలా ప్రేమాయణాలు లాంటివి పెట్టుకోకుండా వర్సటైల్ హీరోగా ఎదగాలని ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు. మరి ముందు ముందు ఈ జంట.. విరోష్ లా పెళ్లి పీటలు ఎక్కుతారా.. ? లేక ఇవన్నీ పుకార్లు అని పక్కకు తప్పుకుంటారో చూడాలి.

Updated Date - Nov 10 , 2026 | 05:11 PM