ఆ బ్రేకప్ సీన్ చేస్తున్నప్పుడు నిజంగానే ఏడ్చేశా: మమితా బైజు

ABN , Publish Date - Sep 27 , 2026 | 03:19 PM

‘ప్రేమలు’ సినిమాతో ఓవర్‌నైట్ సౌత్ ఇండియా మొత్తం క్రేజీ క్రష్‌గా మారిపోయిన మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు. తాజాగా ఆమె ఓ ఎమోషనల్ సీన్‌ తనకు ఎలా కనెక్ట్ అయ్యిందో తెలిపారు.

Mamitha Baiju about Dude Scene

‘ప్రేమలు’ (Premalu) సినిమాతో ఓవర్‌నైట్ సౌత్ ఇండియా మొత్తం క్రేజీ క్రష్‌గా మారిపోయిన మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు (Mamitha Baiju). ఆ చిత్రం సాధించిన అఖండ విజయంతో టాలీవుడ్, కోలీవుడ్‌లలోనూ ఈ బ్యూటీకి విపరీతమైన పాపులారిటీ దక్కింది. ఆ తర్వాత ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి నటించిన ‘డ్యూడ్’ (Dude) చిత్రంతో మరో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రీసెంట్‌గా వచ్చిన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons), ‘బెత్లహాం కుటుంబ యూనిట్’ (Bethlehem Kudumba Unit) సహా పలు వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద గోల్డెన్ లెగ్‌గా దూసుకుపోతున్న ఈ యంగ్ హీరోయిన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, ప్రత్యేకించి ‘డ్యూడ్’ సినిమా చిత్రీకరణ విశేషాలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.


షూటింగ్ సమయంలో తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. ‘డ్యూడ్’ సినిమాలో నాకు బాగా నచ్చిన పాటలలో ‘ఒరుమ్ బ్లడ్’ ఒకటి. ఆ సాంగ్ చిత్రీకరణ సమయంలో టీమ్ అందరం చాలా ఫన్నీగా, సరదాగా గడిపాము. ఆ పాటను సినిమా లాస్ట్ షెడ్యూల్‌లో షూట్ చేశాం కాబట్టి ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయని మమిత చెప్పుకొచ్చారు. ఇక సినిమాలో అందరినీ కదిలించిన ఎమోషనల్ సీన్ గురించి చెబుతూ.. ‘‘సినిమాలో కుందన, గగన్ మధ్య వచ్చే బ్రేకప్ సన్నివేశం నాకు ఎప్పటికీ బాగా గుర్తుండిపోతుంది. ఆ బ్రేకప్ సీన్ చేస్తున్నప్పుడు పాత్రలోని భావోద్వేగాల్లో పూర్తిగా లీనమైపోయాను. నటన కోసం కాకుండా నిజంగానే కళ్లలో నుంచి నీళ్లు వచ్చి ఏడ్చేశాను. అందుకే ఆ సీన్ నా మనసుకు ఎంతో దగ్గరైంది. నా కెరీర్‌లో నాకు బాగా ఇష్టమైన సన్నివేశాలలో ఒకటిగా అది ఎప్పటికీ నిలిచిపోతుంది’’ అంటూ మమితా బైజు భావోద్వేగానికి లోనయ్యారు.


నటనలో సహజత్వం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్న మమితా బైజు.. భావోద్వేగ సన్నివేశాల్లోనూ ప్రాణం పెట్టి నటిస్తుందని చెప్పడానికి ఈ సీనే నిదర్శనమని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్న ఈ మలయాళ కుట్టీ.. భవిష్యత్తులో మరిన్ని విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి:

రాజమౌళి కొన్ని సలహాలిచ్చారు: ఫాహద్‌ ఫాజిల్‌

‘ద ప్యారడైజ్’.. 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే..

‘రణబాలి’ విడుదలకు ముందే ఓటీటీలోకి.. అసలు విషయమిదే

Updated Date - Sep 27 , 2026 | 03:19 PM