ఆస్కార్ డైరెక్టర్‌కు నో చెప్పిన పుష్ప విలన్
ABN, Publish Date - Jul 17 , 2026 | 11:54 AM
మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు దక్షిణాదిలోనే అత్యంత ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే.
మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు దక్షిణాదిలోనే అత్యంత ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. పుష్ప 2 తో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపూ తెచ్చుకున్న ఫహద్ తాజాగా ఒక భారీ హాలీవుడ్ ఆఫర్‌ను వదులుకున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఒక గొప్ప దర్శకుడి సినిమాలో నటించే సువర్ణావకాశాన్ని ఫహద్ ఫాజిల్ ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందనే దానిపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు అలెజాండ్రో జి. ఇనారిటు తన తదుపరి చిత్రం డిగ్గర్ (Digger) లో ఒక కీలక పాత్ర కోసం ఫహద్ ఫాజిల్‌ను సంప్రదించారట. అయితే, ఈ ప్రతిష్టాత్మక హాలీవుడ్ అవకాశాన్ని ఫహద్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండడం వలన డేట్స్ అడ్జస్ట్‌మెంట్స్ కాలేని కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్‌కు సైన్ చేయలేకపోయాడని సమాచారం. డేట్స్ సరిపోకపోవడం వల్లనే ఈ గోల్డెన్ ఛాన్స్‌ను ఆయన అయిష్టంగానే వదులుకోవాల్సి వచ్చింది. ఫహద్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో.. చివరకు ఆ పాత్ర బ్రిటీష్-పాకిస్తానీ నటుడు, ఆస్కార్ విజేత అయిన రిజ్ అహ్మద్ కు దక్కింది.
సౌత్ ఇండస్ట్రీలో తన నటనతో అద్భుతాలు సృష్టిస్తున్న ఫహద్.. ఒకవేళ ఈ హాలీవుడ్ సినిమాను ఒప్పుకొని ఉంటే గ్లోబల్ లెవెల్‌లో ఆయన క్రేజ్ మరో స్థాయికి వెళ్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు సైతం ఫహద్ యాక్టింగ్ టాలెంట్‌ను గుర్తించి పిలిచి మరీ ఆఫర్లు ఇస్తుండటం ఆయన నటనకు దక్కిన గౌరవంగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఇప్పుడు హాలీవుడ్ ఆఫర్ మిస్ అయినా భవిష్యత్ లో ఫహద్ ఫాజిల్ ని హాలీవుడ్ లో చూసే అవకాశం ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.