బాలన్ ట్రైలర్.. అదేం డబ్బింగ్ రా బాబు
ABN, Publish Date - Jun 06 , 2026 | 03:36 PM
మంజుమ్మల్ బాయ్స్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు చిదంబరం. ఈ సినిమా తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాలన్ - ది బాయ్ (Balan- The Boy).
మంజుమ్మల్ బాయ్స్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు చిదంబరం. ఈ సినిమా తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాలన్ - ది బాయ్ (Balan- The Boy). కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమాకు సుషిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక బాలన్ సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేయడం విశేషం. తాజాగా బాలన్ ట్రైలర్ ని అక్కినేని నాగచైతన్య రిలీజ్ చేసి బెస్ట్ విషెస్ తెలిపాడు.
ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ట్రైలర్ చాలా ఇంటెన్స్, సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్‌గా సాగింది. ఒక చిన్న పిల్లాడి చుట్టూ జరిగే క్రైమ్ డ్రామాగా దీనిని చూపించారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ చాలా సీరియస్ మూడ్‌ని క్రియేట్ చేస్తున్నాయి. మానసిక స్థితి సరిగ్గా లేని ఒక తల్లి.. ఆ తల్లి ఏం చేస్తుందో తెలియని ఒక కుర్రాడు. అనుకోకుండా ఆ పిల్లాడు మిస్ అవ్వడం.. అతడి కోసం పోలీసులు వెతకడం.. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్ ని కట్ చేసిన విధానం బావుంది.
ట్రైలర్ అంతా బావుంది కానీ.. డబ్బింగ్ మాత్రం చాలా దారుణంగా ఉంది. తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్టులతో చెప్పిస్తే ఎక్కడ డబ్బులు అయిపోతాయి అనుకున్నారో ఏమో ఏఐ ని ఉపయోగించి డబ్బింగ్ ని ఫినిష్ చేశారు. ఆ డబ్బింగ్ చాలా దారుణంగా ఉంది. ఇంగ్లీష్ సినిమాలకు చెప్పే డబ్బింగ్ అయినా కొంచెం బెటర్ గా ఉంటుంది. కానీ, ఇక్కడ ఏ డైలాగ్ లో కూడా ఎమోషన్ కనెక్ట్ కాలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి పెద్ద సంస్థ ఇలాంటి డబ్బింగ్ ని ఎందుకు ఎంకరేజ్ చేసిందో అర్ధం కావడం లేదు. ఇక ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులను అదేం డబ్బింగ్ రా బాబు అని మండిపడుతున్నారు. మరి అన్నపూర్ణ స్టూడియోస్ మేకర్స్ ఈ తప్పును గ్రహించి మంచి డబ్బింగ్ తో మళ్ళీ ట్రైలర్ ని రిలీజ్ చేస్తారేమో చూడాలి.