సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bachelor Party D’eux: మ‌ల్లు ఇండ‌స్ట్రీ మొత్తం.. ఇందులోనే ఉంది క‌ద‌రా

ABN, Publish Date - Nov 05 , 2026 | 01:57 PM

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అమల్ నీరద్ కాస్త విరామం త‌ర్వాత రూపొందించిన చిత్రం బ్యాచిలర్ పార్టీ డ్యూ.

Bachelor Party D’eux

గ‌తంలో భీష్మ ప‌ర్వం, బోగ‌న్ విల్లా వంటి మ‌ల‌యాళ‌ చిత్రాల‌తో దేశ వ్యాప్తంగా త‌న‌కంటూ ప్ర‌త్యేక పేరును సొంతం చేసుకున్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అమల్ నీరద్ (Amal Neerad) కాస్త విరామం త‌ర్వాత రూపొందించిన చిత్రం బ్యాచిలర్ పార్టీ డ్యూ (Bachelor Party D'eux). ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యాక్ష‌న్ , క్రైమ్ కామెడీ చిత్రం ఈ నెల‌లో ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.

ఈ ట్రైల‌ర్ చూస్తే మోహ‌న్ లాల్‌, మ‌మ్ముట్టి, దుల్క‌ర్ మిన‌హా తెర‌నిండా మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖ న‌టీన‌టులే ఉండి కొత్త అనుభూతిని ఇచ్చారు. రీసెంట్ సెన్షేష‌న్‌ న‌స్లేన్ (Naslen K Gafoor), కుంచ‌కో బోబ‌న్ (Kunchacko Boban), షౌబిన్ షాహిర్‌, టొవినో థామ‌స్ (Tovino Thomas), న‌దియా, రజీషా విజ‌య‌న్ (Rajisha Vijayan), పారీస్ ల‌క్ష్మి, హ‌న్షిక కృష్ణ‌, షైన్ టామ్ చాకో, ష‌ర్ఫుద్దీన్‌, శ్రీనాద్ బ‌స్సీ వంటి దాదాపు డ‌జ‌న్ మందికి పైగా స్టార్స్ తెర నిండా ప్ర‌తి ఫ్రేమ్‌లో క‌నిపించి ఔరా అనిపించారు. ముఖ్యంగా ఎప్పుడు ప‌ద్ద‌తైన పాత్ర‌ల‌తో ప‌క్కింటి అమ్మాయిగా ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు ద‌గ్గ‌రైన ర‌జీషా విజ‌య‌న్ ఘాటైన ముద్దు స‌న్నివేశంలో ద‌ర్ష‌ణ‌మిచ్చి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది.

సినిమా పూర్తిగా క్రైమ్ అండ‌ర్ వ‌ర‌ల్ఢ్ ఇతివృత్తంతో రా అండ్ ర‌స్టిక్‌గా గ్రూపుల మ‌ధ్య వార్ సినిమా తెర‌కెక్కిన‌ట్లు తెలుస్తుంది. హీరో ఎవ‌రో, ప్ర‌తి నాయ‌కుడో ఎవ‌రో అనేది తెలియ‌కుండా ట్రైల‌ర్ క‌ట్ చేశారు. ఇటీవ‌లే నిర్మాత‌గా బెత్లాహం కుటుంబ యూనిట్ సినిమాతో జాక్‌పాట్ కొట్టిన‌ ఫ‌హాద్ పాజిల్ ఈ సినిమాను నిర్మించ‌డం విశేషం. ఇదిలాఉంటే ఈ చిత్రం ఈ నెల‌లోనే థియేట‌ర్ల‌కు రానుండ‌గా తెలుగులో రిలీజ్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. కేర‌ళం నాట ఈ చిత్రంపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.

Updated Date - Nov 05 , 2026 | 03:57 PM