జీవాతో.. జత కడుతున్న ఇవాన
ABN, Publish Date - Mar 04 , 2026 | 09:39 AM
జీవా హీరోగా నటించే ‘జాలియా ఇరుంద ఒరుత్తన్’(జియో)లో హీరోయిన్‌గా లవ్‌లుడే ఇవాన ను ఎంపిక చేశారు.
జీవా (Jiiva) హీరోగా నటించే ‘జాలియా ఇరుంద ఒరుత్తన్’ (Jolliya Iruntha Oruthan) (జియో)లో హీరోయిన్‌గా లవ్‌లుడే ఇవాన (Ivana)ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా అధికారికంగా వెల్లడించారు.
ఎం.రాజేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ మలేషియాలో శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో నటించే నటీనటుల పేర్లను వెల్లడించిన చిత్ర బృందం హీరోయిన్ పేరును మాత్రం సీక్రెట్‌గానే ఉంచింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఇవాన పేరు ప్రకటించింది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన ‘లవ్‌టుడే’ చిత్రంలో ఇవాన హీరోయిన్‌గా నటించి, ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న విషయం తెల్సిందే. అయితే, ఆ తర్వాత ఇవాన నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
ఇదిలావుంటే, 2009లో ఎం.రాజేష్ - జీవా - యువన్ శంకర్ రాజా కాంబినేషన్‌లో ‘శివ మనసులే శక్తి’ సినిమా రాగా ఘన విజయం సాధించింది. ఇపుడు దాదాపు 16 యేళ్ళ తర్వాత ‘జియో’ (JIO) తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.