సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nayanthara: పోయెస్ గార్డెన్‌లో.. మ‌రో ఖ‌రీదైన విల్లా కొన్న లేడీ సూప‌ర్ స్టార్‌! త్వ‌ర‌లో గృహ ప్ర‌వేశం!

ABN, Publish Date - Jul 25 , 2026 | 02:47 PM

సౌత్ ఇండియాలో నయనతార క్రేజ్ ఎప్పుడూ ఒక అద్భుతమనే చెప్పాలి.

Nayanthara

సౌత్ ఇండియాలో నయనతార (Nayanthara) క్రేజ్ ఎప్పుడూ ఒక అద్భుతమనే చెప్పాలి. 'మనస్సినక్కరే' అనే మలయాళం చిత్రంతో తన నటన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, అతి తక్కువ కాలంలోనే సౌత్‌లోని అన్ని ప్రధాన భాషల్లోకి తన ప్రభావాన్ని విస్తరించారు. తమిళంలో 'అయ్యా', తెలుగులో 'లక్ష్మి', 'చంద్రముఖి', 'గజినీ' వంటి వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో స్టార్ హీరోల సరసన నటించి అనతి కాలంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగారు.

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు అత్యంత ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు. కథానాయికగా కెరీర్‌ ప్రారంభించిరెండు పుస్క‌రాలు కావ‌స్తున్నా ఆమె ఇమేజ్, క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం ఆమె అంకితభావాన్ని చాటుతుంది.

ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నయనతార ఎంతో బిజీగా వరుస చిత్రాలు చేస్తూ తన సత్తా చాటుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో అద్భుతమైన బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు. అలాగే ఇటీవ‌లే దిగ్గజ నటులు మమ్ముట్టి, మోహన్ లాల్ సుమారు 17 ఏళ్ల తర్వాత కలిసి చేసిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘పేట్రియాట్’లో కీలక పాత్ర పోషించారు.

ఇక కన్నడలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రంతో పాటు, బాలీవుడ్‌లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో కలిసి మరో భారీ చిత్రంలో నటిస్తూ తన పాన్-ఇండియా ప్రయాణాన్ని మరింత విస్తరిస్తున్నారు. ఇక ఒక్కో సినిమాకు ఏకంగా రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటూ అత్యధిక పారితోషికం తీసుకునే అగ్ర హీరోయిన్‌గా రికార్డు సృష్టిస్తున్నారు.

సినీ రంగంలో నటిగా తిరుగులేని విజయాలను అందుకుంటూనే, వ్యక్తిగత జీవితంలోనూ నయనతార ఎన్నో ఉన్నత మైలురాళ్లను అధిగమిస్తున్నారు. తాజాగా ఆమె చెన్నైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పోయెస్‌ గార్డెన్ (Poes Garden) ప్రాంతంలో ఏకంగా రూ.40 కోట్ల ఖరీదైన (40 Crore Villa) విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, ధనుష్‌తో పాటు పలువురు ప్రముఖ సినీ, రాజకీయ దిగ్గజాలు నివసించే అత్యంత భద్రతా కలిగిన పోయెస్‌ గార్డెన్‌లో ఆమె ఇల్లు కొనుగోలు చేయడం ప్రస్తుతం చెన్నై సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్ప‌టికే.. అదే ప్రాంతంలో ఇల్లు ఉన్న‌ప్ప‌టికీ త్వరలోనే ఆమె తన కుటుంబంతో కలిసి ఈ సరికొత్త విలాసవంతమైన గృహప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై నయనతార నుంచి లేదా ఆమె టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దశాబ్దాలు గడుస్తున్నా చెక్కుచెదరని క్రేజ్‌తో, అత్యధిక పారితోషికం పొందుతూ, ఖరీదైన జీవనశైలితో నయనతార నిజమైన 'లేడీ సూపర్ స్టార్'గా తన సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. మ‌రోవైపు భ‌ర్త విగ్నేశ్ శివ‌న్ (Vignesh Shivan) ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా నిక్ వంటి సినిమాల‌తో రాణిస్తున్నాడు.

Updated Date - Jul 25 , 2026 | 02:59 PM