సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Krithi Shetty: త‌మిళ‌నాట బేబ‌మ్మ‌కు.. చుక్కెదురు! ఇక అవే.. కాపాడాలి

ABN, Publish Date - Jan 21 , 2026 | 04:32 PM

తెలుగు, మలయాళ డెబ్యూ చిత్రాలు కలిసి వచ్చినట్టుగా కృతిశెట్టికి తమిళ డెబ్యూ కలిసిరాలేదు. ఈ రెండు భాషల్లో ఆమె సినిమాలు వంద కోట్ల గ్రాస్ వసూలు చేయగా, తమిళ సినిమా 'వా వాతియార్' అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

Krithi Shetty

కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు పుడతాడని సామెత. కొంతమంది హీరోయిన్ల విషయంలో ఇది సరిగ్గా సరిపోతుంది. ఏ ముహూర్తాన చిత్రసీమలోకి అడుగుపెడతారో కానీ వరుస విజయాలను వాళ్ళను వరించి అగ్రస్థానంలో నిలబెడతాయి. కృతిశెట్టి (Krithi Shetty) కి అలా తెలుగు డెబ్యూ మూవీ 'ఉప్పెన' (Uppena), మలయాళ డెబ్యూ మూవీ 'ఎ.ఆర్.ఎం.' (ARM) కలిసొచ్చాయి. కానీ కోలీవుడ్ డెబ్యూ దగ్గరకు వచ్చేసరికీ అమ్మడికి చుక్కెదురైంది.

కన్నడ భామ కృతీ శెట్టి 2021లో 'ఉప్పెన'తో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా వంద కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన 'శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy), బంగార్రాజు' (Bangarraju) కూడా హిట్టే. అలానే 2024లో ఈ అమ్మడు మల్లూవుడ్ లోకి 'ఎ.ఆర్.ఎం.' మూవీతో అడుగుపెట్టింది. ఆ సినిమా కూడా 106 కోట్ల గ్రాస్ ను వసులూ చేసి, మంచి విజయాన్ని అందుకుంది. కానీ చిత్రంగా ఆ తర్వాత కృతీశెట్టికి మలయాళ సినిమా ఆఫర్స్ ఏవీ రాలేదు.


ఇదిలా ఉంటే... తెలుగులో హ్యాట్రిక్ సాధించిన కృతిశెట్టిని వరుస పరాజయాలు పలకరించాయి. ఇక ఇక్కడ లాభం లేదని ఈ చిన్నది కోలీవుడ్ పై కన్నేసింది. అక్కడ కార్తీ సరసన 'వా వాతియార్' (Vaa Vaathiyaar) మూవీకి సైన్ చేసింది. ఈ సినిమా పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈ యేడాది పొంగల్ కానుకగా జనవరి 14న జనం ముందుకు వచ్చింది. కానీ భారీ డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దాంతో తొలిసారి ఆమెకు డెబ్యూ మూవీ కలిసిరాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే... ఈ సినిమా విడుదల కాకముందే కృతీశెట్టి మరో రెండు తమిళ చిత్రాలను అంగీకరించింది. అందులో ఒకటి 'జయం' రవి సినిమా 'జీని' కాగా మరొకటి ప్రదీప్ రంగనాథన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. ఈ రెండు కూడా ఈ యేడాది విడుదల కానున్నాయి. మరి వీటిలో ఏదైనా సక్సెస్ సాధించింది, కృతీశెట్టికి కోలీవుడ్ లో తొలి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

ఇక... చిరంజీవి హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న సినిమాలో కృతీశెట్టి ఆయన కూతురుగా నటించబోతోందనే వార్త ఫిల్మ్ నగర్ లో హల్చల్ చేస్తోంది. అదే నిజమైతే... కృతీకి తెలుగులోనూ ఓ మంచి అవకాశం లభించినట్టే!

Updated Date - Jan 21 , 2026 | 08:16 PM