సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తమిళనాడు ఎన్నికలు.. స్టార్ల సందడి..

ABN, Publish Date - Apr 23 , 2026 | 10:23 AM

తమిళనాడు అసెంబ్లీ (Tamil Nadu assembly elections)ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఓటర్లు ఉదయాన్నే క్యూ కట్టారు.


తమిళనాడు అసెంబ్లీ (Tamil Nadu assembly elections)ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఓటర్లు ఉదయాన్నే క్యూ కట్టారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. నటుడు, టీవీకే అధినేత విజయ్‌ (Vijay) చెన్నైలో ఓటు వేశారు. అలాగే రజనీకాంత్‌, అజిత్‌, సూర్య, మణిరత్నం, సుహాసిని, కుష్బు సుందర్‌, శివకార్తీకేయన్‌, శశి తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.


తలైవా రజనీకాంత్‌ స్టెల్లా మేరీస్‌ కాలేజీలో రజనీ ఓటు వేశారు. కూతురు శ్రుతి హాసన్‌తో కలిసొచ్చి ఓటు వేశారు విశ్వనాయకుడు కమల్‌హాసన్‌. విక్రమ్‌, అట్లీ తదితరులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రజనీకాంత్‌, అజిత్‌ పోలింగ్‌ బూత్‌కు రాగానే అభిమానులు ఫొటోల కోసం ఎగబడ్డారు. వారందరినీ అజిత్‌ వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సినీ తారలంతా ఉదయాన్నే ఓటు వేయడానికి బారులు తీరడంతో ఆసక్తి నెలకొంది. కోలీవుడ్‌ అంతా విజయ్‌ గెలుపు కోసం కృషి చేస్తుందా అని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 

Updated Date - Apr 23 , 2026 | 11:05 AM