సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రముఖ నిర్మాత ఆత్మహత్య..

ABN, Publish Date - May 17 , 2026 | 07:22 PM

కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత కె. రాజన్ (K. Rajan) (85)ఆత్మహత్య చేసుకున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఆయన అడయార్ కూవం నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

K. Rajan

కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత కె. రాజన్ (K. Rajan) (85)ఆత్మహత్య చేసుకున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఆయన అడయార్ కూవం నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే 85 ఏళ్ళ వయస్సులో రాజన్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. కుటుంబ సమస్యల వలనే ఆయన సూసైడ్ చేసుకున్నారని టాక్. ఏడాదిగా రాజన్.. కుటుంబంతో కలిసి ఉండడం లేదని, హోటల్ లో ఉండడం వలన రోజు కూతురు భోజనం తీసుకోని వస్తోందని తెలుస్తోంది.


రాజన్ 'బ్రహ్మసరిగళ్' చిత్రంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన చెన్నై డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. నిర్మాతగానే కాకుండా డైరెక్టర్ గా, రైటర్ గా కూడా వర్క్ చేశారు. నటుడిగా కూడా రాజన్ మంచి సినిమాల్లో నటించారు. చివరగా ఆయన నటించిన చిత్రం బకాసురన్. ఇక రాజన్ మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా రాజన్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసారు.

Updated Date - May 17 , 2026 | 07:33 PM