సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హీరో కవిన్ దంపతులకు.. కవల పిల్లలు

ABN, Publish Date - Jul 31 , 2026 | 08:24 AM

కోలీవుడ్ హీరో కవిన్, భార్య మోనికా కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఒక బాబు, ఒక పాప జన్మించినట్లు కవిన్ సోషల్ మీడియాలో ప్రకటించారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Kavin

కోలీవుడ్ (Kollywood) యంగ్ హీరో కవిన్ (Kavin) తండ్రయ్యారు. ఈ దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కవిన్ గురువారం తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. 2023 ఆగస్టులో తన స్నేహితురాలైన మోనికా (Monica)ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో తమకు కవల పిల్లలు జన్మించినట్టు వెల్లడించారు. 'మా జీవితాలను రెట్టింపు ఆనందంతో నింపినందుకు ధన్యవాదాలు దేవుడికి కృతఙ్ఞతలు. మాకు ఒక బాబు. ఒక పాప జన్మించారు' అని పేర్కొన్నారు.

కాగా, 'డాడా' చిత్రంలో కవిన్ పిల్లల తండ్రిగా నటించిన విషయం తెల్సిందే. ఈ మూవీ కవిన్ కెరీర్‌లో ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇదిలావుంటే, ప్రస్తుతం సీనియర్ నటి నయనతార (Nayanthara)తో కలిసి కవిన్ హాయ్ (Hi Movie) అనే చిత్రంలో నటిస్తున్నారు. విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన విడుదల కానుంది.

Updated Date - Jul 31 , 2026 | 08:45 AM