Kiara Advani: టాక్సిక్ లో బోల్డ్ సీన్స్ ట్రిమ్ పై స్పందించిన కియారా
ABN, Publish Date - May 04 , 2026 | 06:51 PM
ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతోంది అంటే అది రిలీజ్ అయ్యేవరకు ఏదో ఒక పుకారు వస్తూనే ఉంటుంది. కొందరు వాటిపై రియాక్ట్ అవుతారు. మరికొందరు సైలెంట్ గా ఉండిపోతారు.
Kiara Advani: ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతోంది అంటే అది రిలీజ్ అయ్యేవరకు ఏదో ఒక పుకారు వస్తూనే ఉంటుంది. కొందరు వాటిపై రియాక్ట్ అవుతారు. మరికొందరు సైలెంట్ గా ఉండిపోతారు. సోషల్ మీడియాలో రెండురోజులుగా టాక్సిక్ (Toxic) సినిమా గురించి ఒక వార్త హల్చల్ చేస్తోంది. కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) నటిస్తోన్న చిత్రం టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ (Kiara Advani), నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అన్ని సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 న టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ, కొన్ని కారణాల వలన ఈ సినిమా వాయిదా పడింది. ఈ సినిమాలో నటిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. యశ్ తో చేసిన బోల్డ్ సీన్స్ చాలా ఇబ్బందిగా ఉన్నాయని, వాటిని ట్రిమ్ చేయాలని మేకర్స్ ని కోరినట్లు టాక్ నడిచింది. షూట్ చేసినప్పుడు బాగానే ఉన్నా.. అవుట్ పుట్ లో చూశాక చాలా ఇబ్బందికరంగా అనిపించాయని, తన బోల్డ్ సీన్స్ తానే చూసుకోలేకపోయిందని, అందుకే ఆ సీన్స్ ని ట్రిమ్ చేయమని చెప్పినట్లు సమాచారం.
ఇక ఈ వార్తపై ఎట్టకేలకు కియారా స్పందించింది. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చింది. ఆ రూమర్ పూర్తిగా అర్ధం లేనిదని కొట్టిపారేసింది. దీంతో కియారా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అందాలను ఆరబోయడంలో ముందుండే కియారా.. బోల్డ్ సీన్స్ ని వద్దంది అంటే అందరూ షాక్ అయ్యారు. తల్లిగా మారాక ఆమె తన అందాల ఆరబోతకు ఫుల్ స్టాప్ పెట్టిందేమో అనుకున్నారు. కానీ, అదంతా అబద్దం అని తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. త్వరలోనే టాక్సిక్ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించనుంది. మరి కెజిఎఫ్ తరువాత యశ్ టాక్సిక్ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.