Narendra Modi: వివాహ వేడుకకు ఆహ్వానం!

ABN , Publish Date - May 30 , 2026 | 02:24 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదిని కలిసిన ఖుష్బూ, సుందర్‌ తమ కుమార్తె వివాహానికి ఆయన్ని ఆహ్వానించారు. ఆ సందర్భంగా మోదీతో దిగిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Khushboo

ప్రముఖ నటి ఖుష్భూ (Khushbu) బీజేపీలో క్రియాశీలక నేత. గతంలో ఆమె జాతీయ మహిళా కమీషన్‌ సభ్యురాలిగా కొంతకాలం సేవలు అందించారు. అలానే వేరే పార్టీలలో రాజకీయ నేతగా వ్యవహరించిన ఖుష్బూ బీజేపీలో చేరిన తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖుష్బూ భర్త, ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు సుందర్‌ సి (Sundar C) బీజేపీ మిత్రపక్షపార్టీ తరఫున బరిలో దిగారు. అయితే ప్రత్యక్ష రాజకీయలలో అంతగా అనుభవంలేని సుందర్ మూడో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.


SnapInsta-Ai_3907750656359856106.jpg

తాజాగా ఖుష్భూ దంపతులు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తమ కుమార్తె పెళ్ళి శుభలేఖను అందించారు. ఈ విషయాన్ని ఖుష్భూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 'ఢిల్లీలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గారిని కలిసే అవకాశం లభించడం మా భాగ్యంగా భావిస్తున్నాం. నా భర్త సుందర్‌తో కలిసి మా కుమార్తె వివాహానికి శ్రవణ్‌ శ్రీనివాస్‌ (Shravan Sreenivasan) తో కలిసి ప్రధానమంత్రిని ఆహ్వానించాం. తన బిజీ షెడ్యూల్‌ మధ్య ఆయన సమయం కేటాయించి, కాబోయే వధూవరులను ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు. ఆయన చూపిన ఆదరణకు ఎప్పుడూ రుణపడి ఉంటాం' అని ఆమె పేర్కొన్నారు. ప్రధానమంత్రితో కలిసి దిగిన ఫోటోనూ ఖుష్బూ పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే... సినిమా రంగంలో నటిగా, నిర్మాతగా రాణిస్తున్న ఖుష్బూ... రాజకీయ జీవితాన్ని వృత్తిపరమైన జీవితానికి ముడిపెట్టరు. అందుకే ఆమె రాజకీయ విభేదాలను పట్టించుకోకుండా, ఇటీవల కొత్తగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌ ను, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ను కలిసి మనఃస్ఫూర్తిగా శుభాభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

మెకానికల్ ఇంజనీర్ అవుతానని.. నాన్నకి అబద్ధం చెప్పా: రామ్ చరణ్

అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!

NBK111: బాలయ్య గ్యాంగ్‌స్టర్ లుక్.. ముంబై అడ్డాగా వేట!

యూపీ‌లో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?

Updated Date - May 30 , 2026 | 02:26 PM