కేరళం కీలక నిర్ణయం.. ‘ఆపరేషన్ తుఫాన్’ అంబాసిడర్‌గా ప్రశాంత్
ABN, Publish Date - Aug 31 , 2026 | 09:45 AM
కోలీవుడ్ నటుడు ప్రశాంత్‌ను కేరళ ప్రభుత్వం మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది.
కోలీవుడ్ నటుడు ప్రశాంత్ (Prashanth) కేరళం( Kerala) ప్రభుత్వం మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఆయనకు కేరళ రాష్ట్ర హోం మంత్రి రమేష్ చెన్నితాల గుడ్ విల్ అంబాసిడర్ బ్యాడ్జిని బహుకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారం కోసం 'ఆపరేషన్ తుఫాన్'ను చేపట్టింది.
ఈ ప్రచారానికి హీరో ప్రశాంతన్‌ను ప్రంట్ లైన్ వర్కర్‌గా కేరళం ప్రభుత్వం ఎంపిక చేసి, ఆయనను ఘనంగా సత్కరించింది. ఆ తర్వాత 'బైపాడ్ బోట్ పోటీలను మంత్రితో కలిసి హీరో ప్రశాంత్ ప్రారంభించారు.
కాగా, ఆపరేషన్ తుఫాన్ అనేది కేరళం రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిర్మూలించడానికి, మాదకద్రవ్యాల వాడకాన్ని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం సంయుక్తంగా చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యాచరణ కార్యక్రమం. దీన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళేలా హీరో ప్రశాంత్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ప్రచారం చేయనున్నారు.
కోలీవుడ్ నటుడు ప్రశాంత్‌ను కేరళ ప్రభుత్వం మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది. ‘ఆపరేషన్ తుఫాన్’ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.