సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kayadu Lohar: కొంచెం గ్యాప్‌.. త్వరలో మళ్లీ కలుద్దాం..

ABN, Publish Date - Jun 20 , 2026 | 05:29 PM

హీరోయిన్‌ కయాదు లోహార్‌ (Kayadu Lohar) సోషల్‌ మీడియాకు కొంతకాలం దూరంగా ఉండాలనుకుంటున్నారు.

హీరోయిన్‌ కయాదు లోహార్‌ (Kayadu Lohar) సోషల్‌ మీడియాకు కొంతకాలం దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘మన శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో, మనసుకు కూడా అంతే అవసరం. నాతో నేను గడపాలనుకుంటున్నా. అందుకే సోషల్‌ మీడియా నుంచి కాస్త దూరంగా ఉండాలనుకుంటున్నా. ఎప్పటికప్పుడు నాకు ప్రేమ, ప్రోత్సాహం అందిస్తున్న అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీ సందేశాలు, మీ ప్రేమ నాకు ఎంత విలువైనవో మాటల్లో చెప్పలేను. నన్ను ఎప్పుడూ ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్నా నాకు సంబంధించిన అప్‌డేట్‌లను నా టీమ్‌ ద్వారా తెలియపరుస్తాను. త్వరలో మళ్లీ కలుద్దాం’ అని పేర్కొన్నారు.

అల్లూరి, ఫంకీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన కయాదు ఇటీవల పళ్లిచట్టంబి చిత్రంతో అలరించింది. ప్రస్తుతం ఆమె చేతిలో తమిళ, మలయాళ భాషల్లో అరడజనుకు పైగా సినిమాలున్నాయి.

ఇవి కూడా చదవండి:

‘OG 2’లో ఊహించని మార్పులు.. షూటింగ్ డేట్ ఫిక్స్!

పవన్ అభిమాని నిరంజన్‌‌ను ఈ రోజే కలవడానికి కారణమిదే: బండ్ల గణేష్

మాట నిలబెట్టుకున్న థమన్‌.. ఎంత గొప్ప మనసో!

రుక్మిణి వసంత్‌ మార్ఫింగ్ ఫొటోలు.. ముగ్గురు అరెస్ట్!

Updated Date - Jun 20 , 2026 | 05:37 PM