Vaa Vaathiyaar: వా.. కార్తీ.. వా.. లక్కీ ఛాన్స్ పట్టేశావ్.. తిరుగే లేదు పో
ABN, Publish Date - Jan 10 , 2026 | 08:41 PM
ఈ ఏడాది సంక్రాంతి సినిమాల రిలీజ్ భలే ఉత్కంఠగా మారాయి. రావు అనుకున్న సినిమాలు వస్తున్నాయి. వస్తాయి అన్న సినిమాలు అనుకోకుండా వాయిదా పడ్డాయి.
Vaa Vaathiyaar: ఈ ఏడాది సంక్రాంతి సినిమాల రిలీజ్ భలే ఉత్కంఠగా మారాయి. రావు అనుకున్న సినిమాలు వస్తున్నాయి. వస్తాయి అన్న సినిమాలు అనుకోకుండా వాయిదా పడ్డాయి. టాలీవుడ్ సినిమాల విషయం పక్కన పెడితే.. తమిళ్ సినిమాలు మాత్రం ఈ సంక్రాంతి విడుదలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. విజయ్ జన నాయకుడు (Jana Nayakudu) సెన్సార్ చిక్కుల్లో ఇరుక్కున్న విషయం తెల్సిందే. ఎంత ట్రై చేసినా కూడా అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయలేకపోయారు మేకర్స్. ఇక పరాశక్తి సైతం వివాదంలో ఇరుక్కున్న విషయం కూడా విదితమే. ఏదో విధంగా అన్ని అడ్డంకులను దాటుకొని ఎట్టకేలకు జనవరి 10 న రిలీజ్ కి నోచుకుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో పొంగల్ బరిలో పరాశక్తి ఒకటే దిగింది.
ఇక సడెన్ గా నేనున్నా అంటూ వచ్చేశాడు కార్తీ. గత కొన్నేళ్లుగా కార్తీ నటించిన వా వాతియార్ సినిమా రిలీజ్ కి నోచుకోకుండా ఉండిపోయింది. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై KE జ్ఞానవేల్ రాజా నిర్మించాడు. ఏవో ఇబ్బందుల వలన వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కు సిద్ధం చేశారు. తెలుగులో కూడా అన్నగారు వస్తారు అనే పేరుతో రిలీజ్ కు రెడీ చేశారు. అంతా బావుంది అనుకున్న టైమ్ లో అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యాపారవేత్త.. నిర్మాత తనకు బాకీ ఉన్నాడు.. ఆ బాకీ తీర్చేవరకు ఈ సినిమాను రిలీజ్ చేసే ప్రసక్తే లేదు అని కోర్టుకెక్కాడు.
సరే చిన్న అమౌంట్ అయితే సెటిల్ చేసి రిలీజ్ చేయొచ్చు కదా అనుకుంటే పొరపాటు. నిర్మాత.. వ్యాపారవేత్త వద్ద అక్షరాలా 21 కోట్ల 78 లక్షలు అప్పు చేశాడు. అదంతా తీర్చేవరకు సినిమా రిలీజ్ అవ్వనివ్వను అని దాస్ ఒంటికాలు మీద కూర్చోవడంతో అన్నగారు వస్తారు మరోసారి వాయిదా పడింది. అయితే ఇంత అప్పు తీర్చి ఇప్పుడప్పుడే ఈ సినిమాను నిర్మాత రిలీజ్ చేయడమో అనుకుంటే.. సడెన్ సర్ ప్రైజ్ ఇస్తూ పొంగల్ బరిలో అన్నగారు దిగుతున్నారు అంటూ అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చాడు. జనవరి 14 న వా వాతియార్ తమిళ్ లో రిలీజ్ కానుంది. నిజంగా ఇది కార్తీకి లక్కీ ఛాన్స్. విజయ్ సినిమా రాకపోవడంతో పరాశక్తి ఒక్కటే కోలీవుడ్ లో నడుస్తుంది. అది టక బావుంటే ఓకే.. లేదు అంటే వా వాతియార్ మంచి కలక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. అందుకే ఏదో విధంగా జ్ఞానవేల్ రాజా.. ఆ మొత్తం అమౌంట్ ని సెటిల్ చేసి సినిమాను రిలీజ్ కు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ లక్కీ ఛాన్స్ ను కార్తీ వాడుకుంటాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.