కొంచెం గ్యాప్ ఇవ్వు కార్తీ అన్నా.. అప్పుడే ఇంకొకటా
ABN, Publish Date - Sep 02 , 2026 | 05:36 PM
కోలీవుడ్ వర్సటైల్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే సర్దార్ 2 రిలీజ్ కి రెడీగా ఉంది.
కోలీవుడ్ వర్సటైల్ హీరో కార్తీ (Karthi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే సర్దార్ 2 రిలీజ్ కి రెడీగా ఉంది. ఇది కాకుండా కార్తీ చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో సినిమాకు ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. కమర్షియల్ హంగుల దర్శకుడు సుందర్ సి (Sundar C) కాంబినేషన్‌లో కార్తీ హీరోగా ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఖరారైంది.
వైవిధ్యమైన కథలతో పాటు వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన సుందర్ సి, కార్తీకి ఒక మంచి కథను వినిపించాడని, అది బాగా నచ్చడంతో హీరో కూడా వెంటనే ఓకే చెప్పాడట. ఈ విషయాన్ని సుందర్ సి.. సర్దార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అధికారికంగా ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. మాస్, యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్ కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక సుందర్ సి.. ఈమధ్యనే రజనీకాంత్ సినిమా నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ధర్మాన్ సినిమాకు మొదట సుందర్ సినే దర్శకత్వం వహించాల్సింది. మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ, ఆ తరువాత సుందర్ టను ఈ పెద్ద ప్రాజెక్టు ని హ్యాండిల్ చేయలేనని ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తరువాత ధర్మాన్ అశ్వత్ మారిముత్తు చేతికి వెళ్ళింది. ఇక రజనీ సినిమా మిస్ అయ్యాక సుందర్.. కార్తీతో జతకట్టడం చాలా ఆనందంగా ఉందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరికొంతమంది .. కొంచెం గ్యాప్ ఇవ్వు అన్నా.. సర్దార్ 2 కూడా ఇంకా రిలీజ్ కాలేదు.. అప్పుడే ఇంకొకటా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.