సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kaithi 2: ఆగిపోయిన ఖైదీ 2..

ABN, Publish Date - Jan 18 , 2026 | 03:47 PM

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమా అంటే ఖైదీ (Kaithi) అని చెప్పొచ్చు. కార్తీ(Karthi) హీరోగా నటించిన ఈ సినిమా 2019 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.

Kaithi 2

Kaithi 2: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమా అంటే ఖైదీ (Kaithi) అని చెప్పొచ్చు. కార్తీ(Karthi) హీరోగా నటించిన ఈ సినిమా 2019 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఒక హీరోకి సాంగ్స్, హీరోయిన్ లేకుండా కథను నడిపించడం అంటే ఆషామాషీ కాదు. కానీ, లోకేష్ దాన్ని నిజం చేసి చూపించాడు. ఖైదీలో మిగిలిపోయిన ప్రశ్నలకు సీక్వెల్ లో సమాధానం చెప్పనున్నట్లు తెలిపాడు. ఇక ఈ సినిమా నుంచే లోకేష్ LCU (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) మొదలైంది. ఈ సినిమా తరువాత లోకేష్ నుంచి చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ఖైదీ 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

గతేడాది కూలీ సినిమాతో మొదటి పరాజయాన్ని అందుకున్న లోకేష్.. ఆ తరువాత ఖైదీ 2 మీదనే ఫోకస్ చేస్తున్నాడనుకున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా కోసం అనుష్కను కూడా సంప్రదించారు అని, ఆమె కూడా ఒప్పుకుందని వార్తలు వచ్చాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఖైదీ 2 ఆగిపోయిందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతం లోకేష్ .. అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమా కోసం ఖైదీ 2 ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

తాజాగా కార్తీ ఒక ఇంటర్వ్యూలో ఖైదీ సీక్వెల్ గురించి అడిగినప్పుడు.. అంతా లోకేష్ చేతిలోనే ఉంది అని చెప్పడం మరిన్ని అనుమానాలకు దారి తీసింది. బన్నీ సినిమా కోసం లోకేష్ స్క్రిప్ట్ రెడీ చేసి పనిలో ఉన్నాడని, ఇప్పుడప్పుడే ఈ సీక్వెల్ జోలికి పోయేలా కనిపించడం లేదని తెలుస్తోంది. దీంతో ఖైదీ 2 ఆగిపోయినట్టే అని, దాని మీద ఆశలు వదులుకోవాల్సిందే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Jan 18 , 2026 | 03:50 PM