సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కండోమ్ యాడ్ ఉచితంగా చేయను.. యశ్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Aug 16 , 2026 | 04:29 PM

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా టాక్సిక్ (Toxic) చిత్ర ప్రమోషన్లు ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఈ ప్రమోషన్లలో భాగంగా ప్రముఖ ఇంటర్వ్యూయర్ రజత్ శర్మతో జరిగిన ప్రత్యేక సంభాషణలో యశ్ పాల్గొన్న విషయం తెల్సిందే.

Toxic

రాకింగ్ స్టార్ యశ్ (Yash) నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా టాక్సిక్ (Toxic) చిత్ర ప్రమోషన్లు ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఈ ప్రమోషన్లలో భాగంగా ప్రముఖ ఇంటర్వ్యూయర్ రజత్ శర్మతో జరిగిన ప్రత్యేక సంభాషణలో యశ్ పాల్గొన్న విషయం తెల్సిందే. ఈ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు ఇటీవల విడుదలైన తబాహీ పాటపై నెటిజన్లు, సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల కామెంట్లను ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన చర్చ జరిగింది.


ఇంటర్వ్యూ సందర్భంగా రజత్ .. 'తబాహీ పాట చూడటానికి ఒక కండోమ్ యాడ్ లా ఉందంటూ కొందరు విమర్శిస్తున్నారు, దీనిపై మీరేమంటారు?' అని యశ్‌ను ప్రశ్నించాడు. ఈ ఊహించని ప్రశ్నకు యశ్ ఎంతో సమయస్ఫూర్తితో, తనదైన శైలిలో నవ్వుతూ బదులిచ్చాడు. 'నేను ఉచితంగా అయితే కండోమ్ యాడ్‌లో నటించను కదా సార్' అంటూ సరదాగా పంచ్ విసిరాడు. యశ్ ఇచ్చిన ఈ చమత్కారమైన సమాధానంతో ఇంటర్వ్యూలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. అంతేకాకుండా ఈ సినిమాలో వల్గారీటి ఉంది అన్నవారికి కూడా యశ్ తనదైన రీతిలో సమాధానం చెప్పాడు. ఇందులో ఎలాంటి వల్గారీటి లేదని, సినిమా మొత్తంలో ఏ అమ్మాయిని కూడా తాను కిస్ చేయలేదని తెలిపాడు.


సినిమాలోని పాటలు లేదా సన్నివేశాలను కేవలం వినోదం కోసమే చూడాలని, ప్రతిదానికీ తప్పుడు అర్ధాలు వెతకాల్సిన అవసరం లేదని యశ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ టాక్సిక్ సినిమా విజువల్స్, కంటెంట్ పరంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని యశ్ ధీమా వ్యక్తం చేశాడు. యశ్ చెప్పిన ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆగస్టు 26 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో యశ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Aug 16 , 2026 | 04:29 PM