Toxic: ఆ సినిమాల స్ఫూర్తితో 'టాక్సిక్' రన్ టైమ్ లాక్!
ABN , Publish Date - Aug 14 , 2026 | 03:17 PM
యశ్ తాజా చిత్రం 'టాక్సిక్' రన్ టైమ్ మూడు గంటల పైగానే ఉంది. అయితే 'యానిమల్, పుష్ప 2, ధురంధర్' వంటి సినిమాల నిడివిని దృష్టిలో పెట్టుకుని గీతూ మోహన్ దాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
యశ్ హీరోగా రూపుదిద్దుకున్న చిత్రాలలో అత్యధిక రన్ టైమ్ 'టాక్సిక్' మూవీదే కావడం విశేషం. ఇటీవలే ఈ పాన్ ఇండియా మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూసిన ప్రతి ఒక్కరికీ ఈ మూవీ 'ఎ' సర్టిఫికెట్ అందుకుంటుందనే భావనే కలిగింది. దానికి తగినట్టుగానే కొన్ని కట్స్ తో సెన్సార్ అధికారులు 'టాక్సిక్'కు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే రన్ టైమ్ విషయంలోనే దర్శకురాలు గీతూ మోహన్ దాస్ రాజీ పడకపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఫైనల్ కట్ లో 'టాక్సిక్' రన్ టైమ్ ను మూడు గంటల పద్నాలుగు నిమిషాలకు లాక్ చేశారు. సెన్సార్ అయిన తర్వాత థియేట్రికల్ ఎగ్జిబిషన్ కు అంగీకరించిన నిడివి ఇది.
నిజానికి ఇవాళ ప్రేక్షకులలో ఓపిక అనేది తగ్గిపోయింది. ఎంత గొప్ప సినిమా అయినా దర్శకుడు తాను చెప్పాలనుకున్న కథను రెండున్నర గంటల్లో చెప్పేస్తే బెటర్ అనుకుంటున్నారు. అందుకోసం ఎంతో ఇష్టపడి చిత్రీకరించిన సన్నివేశాలు, తీసిన పాటలను సైతం పక్కన పెట్టేస్తున్నారు. అయితే 'టాక్సిక్' విషయంలో గీతూ మోహన్ దాస్ మాత్రం రాజీ పడటానికి సిద్ధపడలేదని తెలుస్తోంది. అందువల్లే ఈ సినిమా రన్ టైమ్ 3. 14 నిమిషాలు వచ్చిందట.
యశ్ కు జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టిన 'కె.జి.ఎఫ్.' మొదటి భాగం నిడివి రెండు గంటల ముప్పై మూడు నిమిషాలు కాగా, 'కె.జి.ఎఫ్.' చాప్టర్ 2 సినిమా నిడివి రెండు గంటల నలభై ఆరు నిమిషాలు. కానీ ఇప్పుడతని తాజా చిత్రం 'టాక్సిక్' నిడివి మూడు గంటలకు మించిపోయింది. అయితే... ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ మూవీ తీస్తే నిడివి అసలు సమస్యే కాదని కొందరు చెబుతున్నారు. ఇటీవల సూపర్ డూపర్ హిట్ అయిన 'ధురంధర్' మొదటి భాగం నిడివి 2.34 నిమిషాలు కాగా, 'ధురంధర్: ది రివేంజ్' నిడివి 3.49 నిమిషాలు. అలానే 'పుష్ప -2' సినిమా సైతం 3.20 నిమిషాల నిడివితో విడుదలైంది. ఇక హిందీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన రణబీర్ కపూర్ 'యానిమల్' సినిమా 3.21 నిమిషాల నిడివితో విడుదలైన ఘన విజయం సాధించింది. సో... వీటన్నింటి విజయాలను దృష్టిలో పెట్టకునే 'టాక్సిక్' మూవీ రన్ టైమ్ మూడు గంటలు దాటినా ఫర్వాలేదని గీతూ మోహన్ దాస్ భావించినట్టు తెలుస్తోంది. మరి రన్ టైమ్ 'టాక్సిక్'కు ప్రతిబంధకం అవుతుందా? ఉపయోగపడుతుందా? అనేది ఈ నెల 26కి తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి:
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ
వారంలోనే.. ఓటీటీలో హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ ‘లెనిన్’
అగ్నిపరీక్షకు పిలిచి అవమానిస్తారా? నీకిదే నా శాపం: ఉప్పల్ బాలు
స్టేజ్‌పైనే డైరెక్టర్‌కు ‘ఐ లవ్ యూ’ చెప్పిన హీరోయిన్.. అంతా షాక్