Toxic Trailer: తండ్రీకొడుకుల మధ్య యుద్ధం.. అంతా రక్తపాతం
ABN, Publish Date - Aug 08 , 2026 | 07:26 PM
కేజీఎఫ్ ఫ్రాంచైజ్‌తో భారతీయ సినీ రంగాన్ని శాసించిన రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్.
కేజీఎఫ్ ఫ్రాంచైజ్‌తో భారతీయ సినీ రంగాన్ని శాసించిన రాకింగ్ స్టార్ యష్ (Yash) కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ (Toxic: A Fairy Tale for Grown-Ups). గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రతిష్టాత్మక కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా లైన్స్‌గేట్ సంస్థ భాగస్వామ్యంతో నిర్మించారు. ఇక ఈ చిత్రంలో యష్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
టాక్సిక్ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. సుమారు 4 నిమిషాల 38 సెకన్ల భారీ నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ మొత్తాన్ని రక్తపాతంతో నింపేశారు. ఒక సరికొత్త ఇంటర్నేషనల్ డార్క్ అండ్ డార్క్-యాక్షన్ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు. వర్షంలో ఒక చిన్న బాలుడు చేసే ప్రమాణంతో ప్రారంభమయ్యే ట్రైలర్, గ్యాంగ్‌స్టర్ డ్రామా, మాఫియా సామ్రాజ్య పోరాటాలు, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్, సర్కస్ బ్యాక్‌డ్రాప్‌లోని విజువల్స్‌తో కట్టిపడేస్తోంది. రాయ అనే పెద్ద గ్యాంగ్‌స్టర్ జీవితంలో జరిగిన సంఘటనలు.. అతను పోరాడిన వ్యక్తులు అందరిని ఈ ట్రైలర్ లో పరిచయం చేశారు. ఇక చివరికి రాయ.. తన కన్న కొడుకుతోనే యుద్ధం చేయాల్సివస్తుంది. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది.. ? అసలు ఎవరీ రాయ.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే చేసినట్లు ట్రైలర్ లో కనిపించడం లేదు. ముఖ్యంగా నయన్, కియారా.. రాయకు మధ్య ఎమోషనల్ బాండింగ్ ని చూపించారు. ఇక రుక్మిణి ప్రభుత్వం తరుపున పనిచేసే అధికారిగా కనిపిస్తోందని తెలుస్తుంది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, హాలీవుడ్ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్, హై-వోల్టేజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ట్రైలర్ కట్ అదిరిపోయింది. తండ్రీకొడుకులుగా యష్ పిచ్చెక్కించాడు. రవి బసూర్, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్చి మ్యూజిక్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలవనుంది అని చెప్పొచ్చు. ట్రైలర్ తో మేకర్స్ సినిమాపై అంచనాలను పెంచేశారు. ఆగస్ట్ 26 న టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో యష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.