సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రష్మిక షో ఆఫ్ కామెంట్స్‌పై యశ్ రియాక్షన్.. అసలు నిజం ఇదిగో

ABN, Publish Date - Aug 16 , 2026 | 03:28 PM

పాన్ ఇండియా స్టార్ యశ్ (Yash) ప్రస్తుతం తన రాబోయే భారీ యాక్షన్ డ్రామా టాక్సిక్ (Toxic) సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే.

Yash

పాన్ ఇండియా స్టార్ యశ్ (Yash) ప్రస్తుతం తన రాబోయే భారీ యాక్షన్ డ్రామా టాక్సిక్ (Toxic) సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార, రుక్మణి వసంత్, తార సుతరియా, కియారా అద్వానీ, హుమా ఖురేషీ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆగస్టు 26 న టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన యష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో గతంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న తనపై చేసిన మిస్టర్ షో ఆఫ్ వ్యాఖ్యల గురించిన ప్రశ్న ఎదురైంది. రష్మిక వ్యాఖ్యలపై యశ్ ఎంతో హుందాగా, స్పష్టంగా స్పందించి అభిమానులను ఆకట్టుకున్నాడు.


గతంలో రష్మిక ఒక ఇంటర్వ్యూలో యశ్‌ను ఉద్దేశించి చేసిన ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే.2017లో ఇండస్ట్రీ ప్రారంభంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో రష్మిక.. యశ్‌ను ఉద్దేశించి మిస్టర్ షో ఆఫ్ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో యశ్ అభిమానులు రష్మికను తీవ్రంగా ట్రోల్ చేయడంతో ఆమె క్షమాపణలు కూడా చెప్పింది. ఈ విషయంపై యశ్ మాట్లాడుతూ.. 'ఆమె ఏ ఉద్దేశంతో ఆ మాట అనిందో నాకు తెలియదు. అప్పట్లో తను ఇండస్ట్రీకి కొత్త. కొన్ని టీవీ షోలలో యాంకర్లు ఆప్షన్లు ఇచ్చినప్పుడు అలా చెప్పి ఉండవచ్చు. దాన్ని నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఎవరి అభిప్రాయం వారిది, కానీ ఒకరి అభిప్రాయం నా వ్యక్తిత్వాన్ని మార్చలేదు' అని చెప్పుకొచ్చాడు.


అంతేకాకుండా తన అభిమానులకు యశ్ ఒక సందేశాన్ని ఇచ్చాడు. సహ నటీనటులను గౌరవించకుండా సోషల్ మీడియాలో దూషించేవారు తన నిజమైన అభిమానులు కానే కారని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోసారి ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో రష్మికపై యశ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Updated Date - Aug 16 , 2026 | 03:28 PM