సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Yash: ఆ స్టార్‌ ట్యాగ్‌ కంటే.. మంచి సినిమా చేయడం ముఖ్యం..

ABN, Publish Date - Aug 17 , 2026 | 12:38 PM

‘పాన్‌ ఇండియా స్టార్‌’ అనేది మనం చేసే పనిని బట్టి ప్రేక్షకులు ఇచ్చే ఒక గుర్తింపు మాత్రమేనని, సినీ పరిశ్రమలో ఏ స్టార్‌ ట్యాగ్‌ కూడా శాశ్వతంగా ఉండదని కన్నడ స్టార్‌ యశ్‌ అభిప్రాయపడ్డారు

Hero Yash Comments

‘పాన్‌ ఇండియా స్టార్‌’ అనేది మనం చేసే పనిని బట్టి ప్రేక్షకులు ఇచ్చే ఒక గుర్తింపు మాత్రమేనని, సినీ పరిశ్రమలో ఏ స్టార్‌ ట్యాగ్‌ కూడా శాశ్వతంగా ఉండదని కన్నడ స్టార్‌ యశ్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన గీతు మోహన్‌దాస్‌ దర్శకత్వం వహించిన ‘టాక్సిక్‌’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంపై పాన్‌ ఇండియా స్థాయిలో భారీగా అంచనాలున్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా యశ్‌ ఓ హిందీ టాక్‌ షోలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో స్టార్‌ హీరోల ఇమేజ్‌, పాన్‌ ఇండియా స్టార్‌డమ్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాశంగా మారాయి.

ఈ షోలో యశ్‌ను యాంకర్‌ ఓ ప్రశ్న అడిగారు. రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, విజయ్‌, మహేశ్‌ బాబు వంటి దక్షిణాది అగ్ర హీరోలు మీ మాదిరిగా తక్కువ సమయంలో పాన్‌ ఇండియా స్థాయిలో స్టార్లుగా ఎదగలేకపోయారు? ఎందుకు? అని ప్రశ్నించారు. దీనికి యశ్‌ చాకచక్యంగా, వివాదాలకు తావు లేకుండా సమాధానమిచ్చారు. ‘ఎవరికీ స్టార్‌డమ్‌ శాశ్వతం కాదు. దక్షిణాది అగ్ర హీరోలంతా తమదైన శైలి చిత్రాలతో గొప్ప విజయాలు సాధిస్తూ రాణిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు, తలరాత మారిపోవడానికి ఎవరికైనా ఒక్క శుక్రవారం చాలు. సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రేక్షకులు ఇచ్చే తీర్పే హీరో స్టార్‌డమ్‌ను నిర్ణయిస్తుంది. వరుస విజయాలతో ఇమేజ్‌ పెరగవచ్చు.. అలాగే ఒక్క పరాజయం ఆ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేయవచ్చు. అందుకే ‘పాన్‌ ఇండియా స్టార్’ అనే ట్యాగ్‌ కంటే మంచి సినిమాలు చేయడంపైనే దృష్టి పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.


అయితే యశ్‌ ఇచ్చిన సమాధానంతో అభిమానులు, నెటిజన్లు హర్షిస్తున్నారు. తోటి హీరోలను పోల్చకుండా, వారిని గౌరవిస్తూ యశ్‌ సమాధానం చెప్పడంలో ఆయన పరిణీతి మెప్పిస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే యాంకర్‌ ప్రశ్నపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమా గత కొన్నేళ్లుగా పాన్‌ ఇండియా స్థాయిలో సాధించిన విజయాలను గుర్తు చేస్తున్నారు. ‘బాహుబలి’తో ప్రభాస్‌ దేశవ్యాప్తంగా భారీ మార్కెట్‌ను సృష్టించగా.. ‘పుష్ప’తో అల్లు అర్జున్‌ ఉత్తరాదిలో ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించారని, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ అంతర్జాతీయ స్థ్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారని సదరు యాంకర్‌కు కౌంటర్‌ ఇస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇవన్నీ కళ్లముందు కనిపిస్తుండగా తెలుగు స్టార్స్‌ పాన్‌ ఇండియా స్థాయిలో ఎదగలేదని చెబుతూ ప్రశ్నించడం సరికాదని సోషల్‌ మీడియాలో మండిపడుతున్నారు. అయితే ఈ విషయంలో యశ్‌ స్పందించిన తీరు మాత్రం ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి:

‘ఇరుముడి’ వేదికపై బూతులు.. రవితేజ, అజయ్‌ ఘోష్‌పై నెటిజన్ల ఫైర్

రైలులో హీరోయిన్ హల్చల్.. బట్టలు విప్పేసి బ్లేడుతో దాడి

బండ్ల గణేష్ కూతురు పెళ్లి.. అక్కినేని కోడలే హైలైట్

Updated Date - Aug 17 , 2026 | 03:26 PM