సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మంగళ గౌరి.. డ్రాగన్ పాప లేడీ ఓరియెంటెడ్ సినిమా మొదలెట్టేసింది

ABN, Publish Date - Sep 14 , 2026 | 02:41 PM

మామూలుగా ఒక హీరోయిన్‌గా పరిశ్రమలో తిరుగులేని స్థానాన్ని సంపాదించిన తర్వాతనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఆనవాయితీగా వస్తోంది.

Mangala Gouri

మామూలుగా ఒక హీరోయిన్‌గా పరిశ్రమలో తిరుగులేని స్థానాన్ని సంపాదించిన తర్వాతనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఆనవాయితీగా వస్తోంది. అయితే రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)మాత్రం కెరీర్ పీక్ స్టేజ్‌కి వెళ్తున్న సమయాల్లోనే ఇలాంటి విభిన్నమైన, రిస్క్‌తో కూడిన సబ్జెక్ట్‌ను ఎంచుకోవడం ఆమె ధైర్యానికి అద్దం పడుతోంది. అనుష్క, నయనతార,త్రిష, సమంత, కీర్తి సురేష్.. వీరందరూ స్టార్ హీరోల సరసన నటించి టాప్ రేంజ్ కి వెళ్ళాక లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. కానీ. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ మాత్రం హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే టాప్ స్థానానికి చేరుకుంటున్న సమయంలోనే తన భుజాలపై సినిమాను మోసే లేడీ ఓరియెంటెడ్ కథను ఎంచుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం రుక్మిణి.. ఎన్టీఆర్ డ్రాగన్ లో నటిస్తోంది. ఇది ఫినిష్ కాకముందే ఈ చిన్నది లేడీ ఓరియెంటెడ్ సినిమాని మొదలుపెట్టేసింది.


సీనియర్ నటి, కన్నడ లేడీ యాక్షన్ స్టార్ మాలాశ్రీ, రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం మంగళగౌరి. రాహుల్ పి.కె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు కెవిఎన్ ప్రొడక్షన్స్, దాక్షాయణి టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక నేడు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మంగళగౌరి పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేసి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. పోస్టర్‌లో రుక్మిణి వసంత్ పోలీస్ యూనిఫామ్‌లో స్కూటర్‌పై కూర్చొని సరికొత్త లుక్‌లో కనిపిస్తుండగా, ఆమెతో పాటు మాలాశ్రీ నిలబడి సీరియస్ గా కనిపిస్తుంది. కామెడీ, డ్రామా,పోలీస్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఈ కథలో రుక్మిణి నటనకు మంచి ప్రాధాన్యత ఉండే పాత్ర దక్కినట్లు సమాచారం.


వరుసగా పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రుక్మిణి వసంత్‌కు ఈ మొదటి లేడీ ఓరియెంటెడ్ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందోనని ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కనుక బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, రుక్మిణికి కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా సోలో మార్కెట్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. మరి మంగళ గౌరితో రుక్మిణి సాధించే విజయం ఆమె కెరీర్‌ను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.

Updated Date - Sep 14 , 2026 | 02:49 PM