సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బరిలోకి కొత్త... ఆటకు కాదు! విడుదలైన ఆల్ఫా ట్రైలర్

ABN, Publish Date - Feb 09 , 2026 | 04:00 PM

కన్నడ చిత్రం 'ఆల్ఫా' తెలుగులోనూ విడుదల కాబోతోంది. హేమంత్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో అయానా, గోపికా సురేశ్‌ హీరోహీరోయిన్లుగా నటించారు.

Alpha Telugu Movie

హేమంత్ కుమార్, అయానా, గోపిక సురేష్ ప్రధాన పాత్రల్లో విజయ్ ఎన్ తెరకెక్కించిన చిత్రం ‘ఆల్ఫా’. దీనికి మెన్ లవ్ వెంజన్స్ అనేది ఉపశీర్షిక. ఈ కన్నడ చిత్రాన్ని హేమంత్ కుమార్, ఆనంద్ కుమార్ నిర్మించారు. ఫిబ్రవరి 20న 'ఆల్ఫా' రిలీజ్ కాబోతోంది. ఈ మూవీని తెలుగులో రవిశంకర్, మంజునాథ్ పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. దీనికి ప్రముఖ దర్శకులు వి. సముద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

'ఆల్ఫా' ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ‘అంతా ఆ దేవుడి అనుగ్రహంతో జరుగుతుంది అంటే.. మరి ఆ రాక్షసులు...’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ను ఓపెన్ చేశారు. ఆ వెంటనే చూపించిన యాక్షన్ సీక్వెన్స్ బలేగా ఆకట్టుకుంది. ‘నేను బరిలోకి కొత్తగా వచ్చాను.. ఆటకు కాదు’ అని హీరో చెప్పిన డైలాగ్ యూత్ ను మెస్మరైజ్ చేసేలా ఉంది. మధ్యలో హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్; రొమాంటిక్ సీన్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘నాకు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అంతా మా నాన్నే’ అనే డైలాగ్‌తో ఇందులో ఫాదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూ స్థానం ఉందని చెప్పకనే చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా అన్ని రకాల అంశాలను జోడించి ఈ మూవీని తీసినట్టుగా ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది.


ట్రైలర్ ఆవిష్కరణ అనంతరం హీరో హేమంత్ కుమార్ మాట్లాడుతూ, ‘నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. వాటిని ఎక్కువగా చూడటం వల్లే నాకు అంతో ఇంతో తెలుగు వచ్చింది. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన సముద్ర గారికి ధ్యాంక్స్. రవిశంకర్ కన్నడలో మా కంటెంట్ చూసి నచ్చి ఈ చిత్రాన్ని తీసుకున్నారు. తెలుగులో ఆయన భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. నాలాంటి కొత్త వాళ్ల చిత్రాల్ని ఇలా ఎంకరేజ్ చేయడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులు పెట్టే డబ్బులకు సరిపోయే వినోదాన్ని మేం అందిస్తాం’ అని అన్నారు.

'ఆల్ఫా' ట్రైలర్ బాగుందని, హీరో చాలా హ్యాండ్సమ్‌లా ఉన్నారని దర్శకుడు సముద్ర చెబుతూ, యశ్, రిషబ్ శెట్టిలానే హేమంత్ కూడా పెద్ద విజయాన్ని అందుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ‘కేజీయఫ్’, ‘కాంతార’ స్థాయిలో ‘ఆల్ఫా’ని ఆడియెన్స్ ఆదరించాలని ఆయన కోరారు. ఈ సినిమాలో తాను పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించానని, ఆ పాత్ర చేయడం ఛాలెంజింగ్ గా అనిపించిందని అయానా తెలిపింది. ఈ సినిమాలో తాను ఆకాంక్ష అనే పాత్రను పోషించానని, బ్యూటీ విత్ బ్రెయిన్ అన్నట్టుగా తన పాత్ర ఉంటుందని గోపికా సురేశ్‌ చెప్పింది.

తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్న రవిశంకర్ మాట్లాడుతూ, 'కన్నడ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ చూశాను. హీరో నటన అద్భుతంగా అనిపించింది. ఇంతలా కష్టపడే హీరోలు అరుదుగా వస్తుంటారు. ఈ నెల 20న సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నాం' అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయల్ రిడ్జ్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2026 | 04:01 PM