Dileep Raj: ప్రముఖ నటుడు.. దిలీప్‌రాజ్ మృతి
ABN, Publish Date - May 14 , 2026 | 08:20 AM
ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత దిలీప్‌రాజ్ (47) గుండెపోటుతో కన్నుమూశారు. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా గుర్తింపు పొందిన ఆయన మృతిపై సినీరంగం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
ప్రముఖ శాండల్‌వుడ్ నటుడు, నిర్మాత దిలీప్‌రాజ్ (Dileep Raj) (47) గుండెపోటుతో మృతిచెందారు. స్వగృహంలో బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దిలీపరాజ్‌కు భార్య విద్యాశ్రీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా ఆయన కన్నడ సినీరంగంలో తనదైన గుర్తింపు పొందారు.
దిలీప్ మృతికి పలువురు సినీరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దిలీప్ ప్రతిరోజూ వ్యాయామం చేసేవారని, మితంగా ఆహారం తీసుకునేవారని, ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఆయన సన్నిహితులు గుర్తు చేసుకున్నారు. అలాంటి వ్యక్తి గుండెపోటుతో మృతిచెందడం విషాదకరమని విచారం వ్యక్తం చేశారు.