Kamal Haasan: ఒకే నెలలో గురు శిష్యుల మరణం.. తమిళ పరిశ్రమ కన్నీరుమున్నీరు..
ABN, Publish Date - Jun 27 , 2026 | 04:06 PM
తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా (85) ఈ నెల పదో తేదిన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఎంతో మంది నటీనటులను ఆయన వెండితెరకు పరిచయం చేశారు.
తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా (85) ఈ నెల పదో తేదిన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఎంతో మంది నటీనటులను ఆయన వెండితెరకు పరిచయం చేశారు. ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించారు. ఆయన మరణవార్త తెలియగానే కోలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని చిత్ర పరిశ్రమల వారు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. ముఖ్యంగా ఆయనతో ఎంతో అనుబంధం ఉన్న కమల్‌హాసన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాను. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరయ్యారు. కొంతకాలం ఆస్పత్రిలో చికిత్స పొందిన భారతీరాజా మే నెలాఖరులో ఇంటికి డిశ్చార్జి అయ్యారు. జూన్ పదో తేదిన ఆయన కన్నుమూశారు.
ఆయన దగ్గర శిష్యరికం చేసి నటుడిగా, దర్శకుడి,స్క్రీన్‌ప్లే n రైటర్‌గా ఎదిగిన కె.భాగ్యరాజ్ కూడా ఇదే నెలలో మరణించారు. రెండ్రోజులు క్రితం ఓ పెళ్లి వేడుకలో సందడి చేసిన ఆయన ఉన్నట్టుండి కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మరణించారు. భాగ్యరాజ్ మరణంపై కూడా కమల్ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. 50 ఏళ్ల క్రితం నేను పరిచయం చేసిన వ్యక్తి ఈ రోజ మన మధ్య లేదు. ఈ ఏడాది తమిళ సినిమాకు ఎంతగా బాధాకరమైన సంవత్సరం. దిగ్గజ దర్శకుడు, గురుతుల్యులు భారతీరాజా ఇదే నెలలో మరణించారు. ఇప్పుడేమే మరో దర్శకుడు, స్నేహితుడు భాగ్యరాజ్‌ను కోల్పోయాము. ఒకే నెలలో తమిళ చిత్ర పరిశ్రమ ఇద్దరు రాజులను కోల్పోయింది. ఇదేంతో బాధాకరం’ అని కమల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. దీనిపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ.. అవును తమిళ చిత్ర పరిశ్రమ ఇద్దరు అద్భుతమైన దర్శకులను కోల్పోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.