సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘జననాయగన్‌’ లీక్‌పై విశ్వనాయకుడి స్పందన..

ABN, Publish Date - Apr 11 , 2026 | 02:55 PM

విడుదలకు ముందే ‘జననాయగన్‌’(Jana Nayagan) సినిమా లీక్‌ అవ్వడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై టాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇలా దక్షిణాది అగ్ర హీరోలంతా ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

విడుదలకు ముందే ‘జననాయగన్‌’(Jana Nayagan) సినిమా లీక్‌ అవ్వడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై టాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇలా దక్షిణాది అగ్ర హీరోలంతా ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ‘జననాయగన్‌’ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో దర్శనమవ్వడంతో షాక్‌ అయిన దర్శక నిర్మాతలు తక్షణమే పైరసీ కంటెంట్‌ను ఆన్‌లైన్‌ నుంచి తొలగించాలని, లేదంటే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్‌ ఇచ్చారు. లీక్‌ అయినా కొన్ని సన్నివేశాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం కూడా చట్టపరమైన నేరమేనని ఎవరూ షేర్‌ చేయొద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. సినీ ప్రముఖులు దీనిపై వరుసగా స్పందిస్తున్నారు. చిరంజీవి, రజనీకాంత్‌, మోహన్‌బాబు, విజయ్‌ దేవరకొండ ఇలా స్టార్స్‌ అందరూ స్పందించారు.

తాజాగా విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan) కూడా స్పందించారు. ‘సెన్సార్‌ బోర్డ్‌ జాప్యం వల్లే సినిమా లీక్‌ అయింది. ‘జననాయగన్‌’ సినిమా లీక్‌ అవడం అనుకోకుండా జరిగింది కాదు. ఇది వ్యవస్థ వైఫల్యం. ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు అనుకున్న సమయంలో జరిగి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. సెన్సార్‌ బోర్డులో జరిగిన విపరీతమైన జాప్యం సినిమా పైరసీ అయ్యేదాకా తీసుకొచ్చింది. పైరసీ రాజకీయాలకు అతీతమైనది. అది కళపెనౖ, కళాకారుడి పైన చేసే దాడి. వందలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు కష్టాన్ని ఇబ్బందుల్లో పెడుతుంది. మనం ప్రేమించే సినిమాను నిలబెడుతున్న వాళ్లపై, నిజాయతీగా పన్ను చెల్లిస్తున్న నిర్మాతలు, థియేటర్‌ యజమానులపై ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుంది. వ్యవస్థ విఫలమైనప్పుడు సినిమాను ఎవరు కాపాడతారు? విడుదల విషయంలో చట్టపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు విచారణ వేగవంతం చేయాలి. గతంలో మీరు నాకు అండగా నిలిచినట్లే, నిజమైన సినిమా ప్రేమికులు ఈ సమయంలో ఏకమవ్వాలి. ఈ సినిమాను థియేటర్లలోనే చూద్దాం. అందరూ దానికి సహకరించండి’ అని కమల్‌ హాసన్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. విజయ్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి హెచ్‌.వినోద్‌ దర్శకుడు. అనేకమైన కారణాలతో ఈ చిత్రం ఇప్పటికే చాలాసార్లు విడుదల వాయిదా పడింది.

జననాయగన్  లీక్ ఘటనపై  విజయ్ దేవరకొండ కూడా స్పందించారు. తన కెరీర్ లోనూ ఇలాంటి బాధను అనుభవించానని విజయ్ తెలిపారు. జననాయగన్ సినిమాను రిలీజ్ కు ముందు లీక్ చేయడం ఆగ్రహం తెప్పిస్తోంది. నా కెరీర్ ప్రారంభంలో ఇలాంటి బాధాకర ఘటన ఎదుర్కొన్నా. ఆ టైమ్ లో ఎవరో కావాలని చేశారని అనిపించింది. ఆశలన్నీ కోల్పోయాను. సినిమా అనేది హీరోగా నా ఒక్కరికే కాదు.. దర్శకులు, నిర్మాతలు, నటీనటులు..ఇలా అందరి కల. జననాయగన్ సినిమా లీక్ వెనక ఎవరున్నారు అనేది వీలైనంత త్వరగా గుర్తించాలి. ఇతరుల గురించి ఒక్క క్షణం ఆలోచించకుండా తప్పులు చేసేవారు ఎలా ఉంటారో ఈ ఘటనతో మరోసారి అర్థమవుతోంది. జననాయగన్ సినిమా టీమ్ అందరికీ నా మద్ధతు తెలియజేస్తున్నా' అన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 03:59 PM