Kamal Haasan: విజయ్‌కు విశ్వనాయకుడి విషెస్‌..

ABN , Publish Date - Jun 22 , 2026 | 10:39 AM

కోలీవుడ్‌ స్టార్‌ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

కోలీవుడ్‌ స్టార్‌ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు (Vijay) విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఆశీస్సులు అందిస్తూ కమల్‌ ట్వీట్‌ చేశారు. 'లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే పార్టీ (TVK) అధ్యక్షుడు, మన ప్రియ సోదరుడు విజయ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. దేశ ప్రధాని మోడీ,  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విజయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

'విజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. చేపట్టే అన్నీ ప్రయత్నాల్లో విజయం సాధించాలని.. ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నా'అని పవన్  ట్వీట్ చేశారు. వీరితోపాటు పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


గతేడాది థగ్‌ లైఫ్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కమల్‌హాసన్‌ తెలుగులో కల్కి -2 చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో రజనీకాంత్‌ -కమల్‌ కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ALSO READ: ఓజీ 2 మొదలు.. అదొక్కటే మార్పు

Swetha menon: కీలు బొమ్మను కావాలనుకోవడం లేదు..

Allu Arjun: కనిపించే దైవం తండ్రి.. అంటూ భావోద్వేగ పోస్ట్‌..


Updated Date - Jun 22 , 2026 | 12:04 PM