సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నటితో విజయ్ ఎఫైర్.. కొడుకు కీలక నిర్ణయం

ABN, Publish Date - Mar 01 , 2026 | 02:05 PM

దళపతి విజయ్ (Vijay) కుటుంబ సమస్య తమిళ రాజకీయాలను కుదిపేస్తోంది. విజయ్ భార్య సంగీత (Sangeetha).. తన భర్త నుంచి విడాకులు కోరడం చర్చనీయాంశంగా మారిన విషయం తెల్సిందే.

Jason Sanjay

దళపతి విజయ్ (Vijay) కుటుంబ సమస్య తమిళ రాజకీయాలను కుదిపేస్తోంది. విజయ్ భార్య సంగీత (Sangeetha).. తన భర్త నుంచి విడాకులు కోరడం చర్చనీయాంశంగా మారిన విషయం తెల్సిందే. 26 ఏళ్ళ వివాహబంధం తరువాత సంగీత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. విజయ్ కి ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని, దానివల్లనే తాము విడిపోతున్నట్లు పిటిషన్ లో సంగీత పేర్కొన్నారు. ఇక ఆ నటి ఎవరో కాదు.. త్రిష కృష్ణన్ (Trisha Krishnan) అని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కొన్నేళ్లుగా విజయ్ - త్రిష రిలేషన్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తూనే వస్తున్నాయి. అయితే అప్పుడప్పుడు త్రిష వాటిని కొట్టిపారేయడంతో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఇప్పుడు సంగీత విడాకులు కావాలని కోరడంతో త్రిష- విజయ్ రిలేషన్ నిజమే అని తెలుస్తోంది.

ఇక విజయ్- సంగీత విడాకుల వివాదంలో వారి కుమారుడు జేసన్ సంజయ్ తల్లికి తోడుగా నిలబడినట్లు తెలుస్తోంది. తాజాగా జేసన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. జేసన్ తన ఇన్స్టాగ్రామ్ లో విజయ్ ని అన్ ఫాలో చేసినట్లు టాక్ వినిపిస్తోంది. విజయ్ - త్రిష రిలేషన్ గురించి జేసన్ కి ముందే తెలుసని, అందుకే అతను మొదటి నుంచే తండ్రికి దూరంగా ఉంటున్నాడని సమాచారం. మొదటి నుంచి విజయ్ నటవారసుడిగా జేసన్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెడతాడని అనుకున్నారు. కానీ, తండ్రి బాటలో కాకుండా జేసన్ తన సొంత దారిని వెతుక్కున్నాడు. డైరెక్టర్ గా తొలిఅడుగు వేశాడు. సందీప్ కిషన్ హీరోగా 'సిగ్మా' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు జేసన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటుంది.

ఇంకోపక్క విజయ్ ఫ్యాన్స్ మాత్రం జేసన్ మొదటి నుంచి తన తండ్రి విజయ్ ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కావడం లేదని, ఇప్పుడు కొంతమంది సడెన్ గా చూసి విజయ్ ని జేసన్ అన్ ఫాలో చేశాడని చెప్తున్నారని, ఇదంతా విజయ్ పై జరుగుతున్న కుట్ర అని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే విజయ్ కుటుంబం అధికారికంగా మీడియా ముందుకు వచ్చి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మరి అది జరుగుతుందా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Mar 01 , 2026 | 02:05 PM