సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jananayagan: షాకింగ్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌.. మైండ్‌ బ్లాకే..

ABN, Publish Date - Jan 02 , 2026 | 06:38 PM

విజయ్‌, హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘జన నాయగన్‌’. రాజకీయ పార్టీతో బిజీ అయిన విజయ్‌కు ఇది చివరి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

Vijay

విజయ్‌(Vijay), హెచ్‌.వినోద్‌ (H vinod) దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘జన నాయగన్‌’(janajayagan). రాజకీయ పార్టీతో బిజీ అయిన విజయ్‌కు ఇది చివరి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ వెర్షన్‌కు సంబంధించి వివిధ దేశాల్లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. వీటిద్వారా ఇప్పటి వరకూ రూ.15 కోట్లు వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగులో విజయవంతమైన ‘భగవంత్‌ కేసరి’కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి దాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలో దర్శకుడు హెచ్‌.వినోద్‌ స్పందించారు. ‘నేను ఈ విషయాన్ని ధ్రువీకరించను. అలాగే కొట్టిపారేయను. ఇంతకుముందు కూడా మీకు ఈ విషయం చెప్పాను. ఇది దళపతి మూవీ. ఇది రీమేకా? ఏదైనా చిత్రం నుంచి స్ఫూర్తిపొంది తీశారా? అన్న విషయంపై ప్రేక్షకులు టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. వచ్చి సినిమా చూడండి’ అని అన్నారు. జనవరి 3న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమా విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Jan 02 , 2026 | 06:43 PM