సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'జైలర్ 2' కోసం.. సూపర్ స్టార్ల కలయిక

ABN, Publish Date - Apr 07 , 2026 | 07:23 PM

స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్ అప్పియరెన్స్ చేసిన చిత్రాల గురించి విని ఉంటారు. కానీ ఒకరిద్దరు కాదు, ఏకంగా నలుగురు టాప్ మోస్ట్ హీరోలు ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

jailer2

ఇద్దరు హీరోలు కలసి చేసిన మల్టీస్టారర్ మూవీలు ఎన్నో చూసి ఉంటారు. ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్ అప్పియరెన్స్ చేసిన చిత్రాల గురించి విని ఉంటారు. కానీ ఒకరిద్దరు కాదు, ఏకంగా నలుగురు టాప్ మోస్ట్ హీరోలు ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఏ ఇండస్ట్రీలో నైనా మల్టీస్టారర్ మూవీస్ చాలా కామన్ . అలా స్టార్ హీరోలు కలసి నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఏదో గెస్ట్ రోల్‌లో అలా వచ్చిపోయే చిత్రాలే ఎక్కువ. అది కూడా మాగ్జిమమ్ ముగ్గురు స్టార్ హీరోలు చేసిన మూవీలే కనిపిస్తుంటాయి. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) జైలర్ 2 (Jailer 2) మాత్రం కొత్త సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది.

దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) రూపొందిస్తున్న 'జైలర్ 2' మూవీలో రజనీకాంత్‌తో పాటు వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోస్ మెరవబోతున్నారు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal), కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (Shivarajkumar) కనిపించబోతున్నారు. ప్రస్తుతం బేగంపేట్‌లో జరుగుతున్న ఓ కీలక షెడ్యూల్‌లో ఈ నలుగురు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించనున్నారు.

సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో తీస్తున్న 'జైలర్ 2'కు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 'జైలర్' మొదటి భాగం భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌పై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా తెరకెక్కనున్న యాక్షన్ సీన్స్‌లో నలుగురు సూపర్ స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో కనువిందు చేయనున్నారు. ఈ రేర్ కాంబినేషన్ ఆడియెన్స్‌కు ఐఫీస్ట్‌గా మారుతుందని మేకర్స్ భావిస్తున్నారట.

అంతేకాక పాన్ ఇండియా రేంజ్‌లో భారీ వసూళ్ళు సాధించే అవకాశం ఉందని బాక్సాఫీస్ వర్గాలు అంటున్నాయి. అయితే.. త‌మిళంతో స‌మానంగా తెలుగులోను మార్కెట్ ఉన్న ర‌జ‌నీకాంత్ త‌న సినిమాలో తెలుగు హీరో లేక పోవ‌డంపై ఇక్క‌డి అభిమానులు చాలామంది నిరుత్సాహ ప‌డుతున్నారు. మొద‌ట్లో ఈ సినిమాలో బాల‌కృష్ణను తీసుకుందామ‌ని అనుకున్న‌ప్ప‌టికీ ఎందుక‌నో చివ‌రి నిమిషంలో నిర్ణ‌యం మార్చుకుని బాలీవుడ్ నుంచి షారుఖ్‌ను ఫీల్డ్‌లోకి తీసుకు వ‌చ్చారు.

Updated Date - Apr 07 , 2026 | 07:23 PM