సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ముగింపు దశలో.. ‘జైలర్‌-2’

ABN, Publish Date - Apr 05 , 2026 | 06:16 AM

‘జైలర్‌-2’ సినిమా చిత్రీకరణ పనులు ముగింపు దశలో ఉన్నాయని, సూపర్‌స్టార్‌ రజనీకాంత్ తెలిపారు.

డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో తాను హీరోగా నటిస్తున్న ‘జైలర్‌-2’ (Jailer 2) సినిమా చిత్రీకరణ పనులు ముగింపు దశలో ఉన్నాయని, ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని సూపర్‌స్టార్‌ రజనీకాంత్ (Rajinikanth) తెలిపారు.

ఆయన శనివారం చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ‘జైలర్‌-2’ చిత్రీకరణ పూర్తయిందా?, ఎప్పుడు రిలీజ్‌ చేస్తున్నారు? అంటూ విలేకరులు ప్రశ్నించారు. దీనికి రజనీకాంత్‌ సమాధానమిస్తూ.. మూవీ చిత్రీకరణ పూర్తి కానుంది. రిలీజ్‌ తేదీని నిర్మాణ సంస్థ వెల్లడిస్తుంది’ అని పేర్కొన్నారు.

ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తారా? ప్రజలకు ఏం చెప్పదలచుకున్నారు? అని ప్రశ్నించగా పెద్దగా ఓ నవ్వు నవ్వి రెండు చేతులు జోడించి వెళ్ళిపోయారు.

Updated Date - Apr 05 , 2026 | 06:16 AM