సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rajinikanth: జైలర్‌ 2 షూటింగ్‌ పూర్తి

ABN, Publish Date - Apr 21 , 2026 | 12:35 PM

రజనీకాంత్‌ జైలర్‌ 2 మూవీ షూటింగ్ పూర్తయ్యింది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Jailer 2

సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్ (Nelson Dilip Kumar) 2023లో తెరకెక్కించిన 'జైలర్‌' సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఆ సినిమాకు సీక్వెల్ చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్‌ భావించింది. కాస్తంత గ్యాప్‌ తీసుకున్ని రజనీకాంత్‌, నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కాంబోలోనే 'జైలర్‌ 2' (Jailer 2)ను రూపొందించింది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయినట్టు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌తో సహా ముగింపు రోజు షూటింగ్‌లో పాల్గొన్న అందరూ కలిసి ఉత్సాహపూరిత వాతావరణంలో కేక్‌ కట్ చేసి... శుభాకాంక్షలు తెలుపుకున్నారు.


'జైలర్ 2' సినిమాలో రజనీకాంత్‌ సరసన రమ్యకృష్ణ నాయికగా నటించగా, ఎస్.జె. సూర్య, యోగిబాబు, మీర్నా, అన్నా రాజన్‌, జతిన్‌ సర్నా సూరజ్‌ వెంజరమూడీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మిధున్‌ చక్రవర్తి, మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్; వినాయకన్, విజయ్‌ సేతుపతి ఇందులో అతిథి పాత్రల్లో మెరియబోతున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని మాత్రం ఇంకా అధికారికంగా తెలియచేయలేదు.

Updated Date - Apr 21 , 2026 | 12:35 PM