Rajinikanth: రిలీజ్‌కు ముందే రజనీ రికార్డుల వేట..
ABN, Publish Date - Oct 06 , 2026 | 04:55 PM
బాక్సాఫీస్ వద్ద మరోసారి తలైవా తుఫాను మొదలైంది. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లలో ఈలలు, గోలలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పనే లేదు.
బాక్సాఫీస్ వద్ద మరోసారి తలైవా తుఫాను మొదలైంది. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లలో ఈలలు, గోలలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పనే లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'జైలర్ 2'(Jailer 2). ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఇంటర్నెట్‌ను ఊపేస్తుండగా, రిలీజ్‌కు ముందే ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ మూవీ సరికొత్త రికార్డులను తిరగరాయడం మొదలుపెట్టింది. ఈ సినిమాపై ఇంతటి భారీ హైప్ రావడానికి ప్రధాన కారణం 'జైలర్' మొదటి భాగం సృష్టించిన ప్రభంజనమే. ప్రపంచవ్యాప్తంగా పార్ట్ వన్ సాధించిన విజయం ఒక చరిత్ర.
ముత్తువేల్ పాండియన్‌గా రజనీ స్వాగ్, నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్, రా యాక్షన్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. వీటికి తోడు మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ లాంటి దిగ్గజాల అతిథి పాత్రలు థియేటర్లను షేక్ చేశాయి. వీటన్నింటినీ మించి అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్లాయి. దాంతో మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు వస్తున్న 'జైలర్ 2'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా రిలీజైన ట్రైలర్ చూశాక ఫ్యాన్స్ అంచనాలు డబుల్ అయ్యాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో యూఎస్ మార్కెట్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇంకేముంది, అక్కడ తలైవా ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగబడుతున్నారు. కేవలం ప్రీమియర్స్ బుకింగ్స్‌తోనే ఈ సినిమా ఏకంగా 4 లక్షల డాలర్ల గ్రాస్‌ను కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే అతి త్వరలోనే ఈ మూవీ చాలా సులభంగా మిలియన్ డాలర్ల మార్కును దాటేసేలా కనిపిస్తోంది.
గతంలో 'జైలర్' మొదటి భాగం ఓవర్సీస్‌లో ఏకంగా 196 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర తమిళ సినిమాల్లో సరికొత్త ట్రెండ్‌కు నాంది పలికింది. ఇప్పుడు పార్ట్ 2 ఆ రికార్డులను కూడా బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతోంది. రిలీజ్ సమయానికి ఈ అడ్వాన్స్ సేల్స్ ఏ రేంజ్ కలెక్షన్స్‌ను నమోదు చేస్తాయో ఊహించుకోవచ్చు. మొత్తానికి నెల్సన్ స్క్రీన్‌ప్లే, అనిరుధ్ మ్యూజిక్, సూపర్ స్టార్ మేనరిజమ్స్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం ఖాయమని అర్థమవుతోంది. ప్రీమియర్స్‌తోనే యూఎస్‌లో 4 లక్షల డాలర్లు దాటేసిన ఈ సీక్వెల్, ఫైనల్‌గా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. మరి జైలర్-2 రిలీజ్ అయ్యే సరికి ఎన్ని రికార్డ్స్ నమోదు చేస్తుందో చూడాలి.