సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రాజేంద్ర ప్రసాద్ క్షమాపణకు విశాల్ రియాక్షన్ 

ABN, Publish Date - Mar 13 , 2026 | 09:51 PM

ఎంజీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ ఎంజీఆర్ అభిమానులకు నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే.

ఎంజీఆర్‌పై (MGR) చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ ఎంజీఆర్ అభిమానులకు నటుడు రాజేంద్ర ప్రసాద్ (rajendraprasad) క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. దీనిని ఉద్దేశించి హీరో విశాల్ (Vishal) స్పందించారు.  రాజేంద్ర ప్రసాద్ కు  థాంక్స్ చెబుతూ ఆయనొక వీడియో వదిలారు.

'ఎంజీఆర్‌' గారి గురించి సీనియర్  నటుడైన మీకే బాగా తెలుసు. మేమంతా ఇప్పుడిప్పుడు వస్తున్నాం. కానీ సీనియర్ నటులు, ఆయనతో ప్రయాణం చేసిన చాలా మంది మీ వ్యాఖ్యలకు బాధపడ్డారు. అందుకే తమిళనాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి తక్షణమే స్పందించాలని  మీకు ఒక రిక్వెస్ట్ పెట్టాము.  మీరు వెంటనే స్పందించినందుకు థాంక్స్. మీలాంటి సీనియర్  ఆర్టిస్టులపై కామెంట్స్ చేసిన మేము అలాగే రియాక్ట్ అవుతాము. మా రిక్వెస్ట్ అంగీకరించి వెంటనే రియాక్ట్ అయినా మీరు గొప్ప వ్యక్తి ' అని విశాల్ వీడియోలో పేర్కొన్నారు. 

Updated Date - Mar 13 , 2026 | 09:57 PM