శింబు 'అరసన్' నుంచి అనిరుధ్ ఔట్? నిర్మాత క్లారిటీ!
ABN, Publish Date - Nov 25 , 2026 | 06:27 AM
శింబు హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరసన్ సినిమా నుంచి అనిరుధ్ తప్పుకున్నారనే ప్రచారంపై నిర్మాత కలైపులి ఎస్.థాను స్పందించారు. కీలక విషయాలు వెల్లడించారు.
అరసన్ - అనిరుధ్‌ను వేరు చేసే అవకాశం లేదని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను (Kalaippuli S Thanu) అన్నారు. 'వి' క్రియేషన్స్ పతాకంపై వెట్రిమారన్ (Vetri Maaran) దర్శకత్వంలో థాను నిర్మిస్తున్న తాజా చిత్రం అరసన్ (Arasan). ఈ చిత్రంలో శింబు (Silambarasan), యోగలక్ష్మి జంటగా నటిస్తున్నారు. అయితే, చిత్రం షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి అనేక అవాంతరాలు ఎదుర్కొంటోంది. కొన్ని రోజులుగా ఆపేసిన చిత్రీకరణ ఇటీవలే మొదలు పెట్టారు. ఇంతలోనే మరో చేదు వార్త హల్చల్ చేస్తోంది.
తాజాగా వివాహం చేసుకున్న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్.. ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు ప్రచారం సాగుతోంది. వీటిపై నిర్మాత కలైపులి ఎస్.థాను వివరణ ఇచ్చారు. తదుపరి దశ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభమవుతుంది. 'అరసన్ ఫైర్ ప్రోమో యూట్యూబ్‌లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అందువల్ల అరసన్ - అనిరుధ్ ను వేరు చేసే అవకాశం లేదు' అంటూ స్పష్టతనిచ్చారు.