Ilaiyaraaja: విజయ్‌కు ఇళయరాజా మద్దతా?
ABN, Publish Date - May 02 , 2026 | 03:52 PM
రాజకీయ రంగ ప్రవేశం చేసిన హీరో విజయ్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మద్దతుగా నిలిచారా? అనే చర్చ ఇపుడు కోలీవుడ్‌లో మొదలైంది.
రాజకీయ రంగ ప్రవేశం చేసిన హీరో విజయ్‌కు (vijay) ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మద్దతుగా నిలిచారా? అనే చర్చ ఇపుడు కోలీవుడ్‌లో మొదలైంది. దీనికి కారణం లేకపోలేదు. గతంలో విజయ్ నటించిన ‘ఇదు ఎంగల్ నీది’ అనే చిత్రం పోస్టరుతో పాటు ఇందులో ‘చిన్న తంబి ఉన్నై నంబి ఇంద నాడు కాత్తిరుక్కు’ అనే పాటను తన యూబ్యూట్‌లో ఇళయరాజా షేర్ చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే పార్టీని స్థాపించిన విజయ్ పోటీ చేసిన విషయం తెల్సిందే. ఈ నెల 4న వచ్చే ఫలితాల్లో విజయ్ పార్టీ పెను ప్రభావం చూపించనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇళయరాజా.. ‘ఉన్నై నంబి ఇంద నాడు కాత్తిరుక్కు’ అనే వీడియో పాటను ఇళయరాజా షేర్ చేయడంతో విజయ్ రాజకీయ రంగ ప్రవేశానికి మద్దతు తెలిపారా? అనే ప్రశ్న కోలీవుడ్‌లో ఉత్పన్నమైంది.