సుప్రీమ్ కోర్టులో.. ఇళయ రాజా స్పెషల్ లీవ్ పిటిషన్
ABN , Publish Date - Aug 26 , 2026 | 05:43 AM
‘ఎన్ ఇనియ పొన్ నిలావే’ (En Iniya Pon Nilave) పాట కాపీ రైట్‌కి సంబంధించి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) సుప్రీమ్ కోర్టు ( Supreme Court) ను ఆశ్రయించారు.
‘ఎన్ ఇనియ పొన్ నిలావే’ (En Iniya Pon Nilave) పాట కాపీ రైట్‌కి సంబంధించి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) సుప్రీమ్ కోర్టు ( Supreme Court)ను ఆశ్రయించారు. ఈ పాట విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీమ్ కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ‘ఎన్ ఇనియ పొన్ నిలావే’ ఒరిజినల్ పాట ఉన్న ‘మూడు పని’ (Moodu Pani) సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూర్చారు. సంగీత హక్కులు ప్రస్తుతం సారేగామా ఇండియా దగ్గర ఉన్నాయి.
అయితే ఈ పాటను ‘అగత్తియా’ (Aghathiyaa) చిత్రంలో వాడుకోవడానికి ఆ మధ్య ఇళయరాజా అనుమతి ఇచ్చారు. దీనిపై సారేగామా (Saregama) ఢిల్లీ హైకోర్టు (High Court of Delhi) ను ఆశ్రయించి, తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. వాదన విన్న ఢిల్లీ హైకోర్టు పాట స్వరకల్పనపై మాత్రమే ఇసైజ్ఞానికి హక్కు ఉంటుందని తెలిపింది. సౌండ్ రికార్డింగ్, సాహిత్యం విషయంలో ఆయనకు కాపీరైట్ లేదని స్పష్టం చేసింది.