పాటల్లో ట్యూన్‌పై మాత్రమే హక్కు.. సుప్రీమ్‌కోర్టులో ఇళయరాజాకు షాక్
ABN, Publish Date - Oct 02 , 2026 | 05:57 AM
సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja)కు సుప్రీమ్ కోర్టు (Supreme Court of India ) షాక్ ఇచ్చింది.
సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja)కు సుప్రీమ్ కోర్టు (Supreme Court of India ) షాక్ ఇచ్చింది. ‘ఎన్ ఇనియ పొన్ నిలావే’ పాట కాపీరైట్ విషయంలో ఇళయరాజా అప్పీల్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘మూడు పని’ చిత్రంలోని ఈ పాటను ‘అగత్తియా’ చిత్రంలో వాడిన వివాదంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీమ్ కోర్టు స్పష్టం చేసింది.
పాటల్లో ట్యూన్‌పై మాత్రమే ఇళయరాజాకు హక్కు ఉంటుందని తెలిపింది. పాటలోని సాహిత్యం, సౌండ్ రికార్డింగ్ కాపీ రైట్ హక్కులు ఆయనకు చెందవని పేర్కొంది. ఇదే విషయమై ‘సరిగమ’ ఆడియో సంస్థకు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. తమిళ చిత్రం ‘అగత్తియా’ చిత్రంలో ‘ఎన్ ఇనియ పొన్ నిలావే’ సాంగ్ రీక్రియేటెడ్ వెర్షన్ వివాదంపై ఇళయరాజా ఈ పిటిషన్ దాఖలు చేశారు.